భారత్ లో చైనా యాప్స్ కి మంగళం?

టిక్ టాక్ వంటి చైనా యాప్ లు భారత్ లో అత్యంత ప్రజాధరణను పొందిన విషయం తెలిసిందే.. అయితే టిక్‌ టాక్‌ తో స‌హా మొత్తం 59 చైనా యాప్స్‌ పై భార‌త ప్రభుత్వం నిషేధం విధించిన నేప‌థ్యంలో ‘టిక్‌ టాక్ ఇండియా’ నేడు ఓ ప్రక‌ట‌న విడుదల చేసింది. వినియోగదారుల సమాచార భద్రత, గోప్యత విష‌యంలో భార‌తీయ చ‌ట్టాల‌కు లోబ‌డి ఉన్నట్లు పేర్కొంది. భార‌తీయ వినియోగదారులకు సంబంధించిన స‌మాచారాన్ని విదేశీ ప్రభుత్వాల‌తో పంచుకోలేదని చెప్పుకొచ్చింది. చైనాకు […]

Written By: Neelambaram, Updated On : June 30, 2020 5:08 pm
Follow us on

టిక్ టాక్ వంటి చైనా యాప్ లు భారత్ లో అత్యంత ప్రజాధరణను పొందిన విషయం తెలిసిందే.. అయితే టిక్‌ టాక్‌ తో స‌హా మొత్తం 59 చైనా యాప్స్‌ పై భార‌త ప్రభుత్వం నిషేధం విధించిన నేప‌థ్యంలో ‘టిక్‌ టాక్ ఇండియా’ నేడు ఓ ప్రక‌ట‌న విడుదల చేసింది. వినియోగదారుల సమాచార భద్రత, గోప్యత విష‌యంలో భార‌తీయ చ‌ట్టాల‌కు లోబ‌డి ఉన్నట్లు పేర్కొంది. భార‌తీయ వినియోగదారులకు సంబంధించిన స‌మాచారాన్ని విదేశీ ప్రభుత్వాల‌తో పంచుకోలేదని చెప్పుకొచ్చింది. చైనాకు కూడా తాము ఎలాంటి స‌మాచారాన్ని అందజేయలేదని వివరణ ఇచ్చింది. ఒక‌వేళ ఎవ‌రైనా భ‌విష్యత్తులో స‌మాచారం కోరినా.. అందజేసే ప్రసక్తే లేదని తెలిపింది. వినియోగదారుల సమాచార భద్రత, గోప్యతకే తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొచ్చింది.

టిక్‌ టాక్ ఇండియా యాప్‌ నకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింద‌ని ఆ యాప్ ఇండియన్ చీఫ్‌ నిఖిల్ గాంధీ తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇస్తామని చెప్పారు. టిక్‌ టాక్‌ ని భారతీయులకు మరింత దగ్గర చేసేందుకు 14 భాషల్లోకి మార్చామన్నారు. చాలా మంది టిక్‌ టాక్‌ పై ఆధారపడి ఉపాధి పొందుతున్నారని.. టిక్‌ టాక్‌ ని నిషేధిస్తే వారంతా సమస్యలు ఎదుర్కొంటారని చెప్పుకొచ్చారు.