https://oktelugu.com/

వైసీపీలో విజయసాయిరెడ్డి సీన్ ముగిసిందా?

వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ వెన్నంటే ఉన్నాడు. జగన్ వ్యాపార సామ్రాజ్యాన్ని చూశాడు. జగన్ తోపాటు జైలుకెళ్లాడు. అందుకే జగన్ కు నమ్మిన బంటుగా మారాడు. వైసీపీ అధినేత జగన్ ఏకంగా విజయసాయిని రాజ్యసభ ఎంపీని చేసి పార్టీలో తన తరువాత అన్నీ తానై వ్యవహరించే నంబర్ 2 పోస్టును కట్టబెట్టారు. అయితే వరుసగా పార్టీలో పెరిగిపోతున్న అసహనం.. ఎమ్మెల్యేల విమర్శలు.. ఇటీవల విజయసాయిరెడ్డి వల్లే వైసీపీ నాశనం అవుతోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 30, 2020 / 05:29 PM IST
    Follow us on


    వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ వెన్నంటే ఉన్నాడు. జగన్ వ్యాపార సామ్రాజ్యాన్ని చూశాడు. జగన్ తోపాటు జైలుకెళ్లాడు. అందుకే జగన్ కు నమ్మిన బంటుగా మారాడు. వైసీపీ అధినేత జగన్ ఏకంగా విజయసాయిని రాజ్యసభ ఎంపీని చేసి పార్టీలో తన తరువాత అన్నీ తానై వ్యవహరించే నంబర్ 2 పోస్టును కట్టబెట్టారు.

    అయితే వరుసగా పార్టీలో పెరిగిపోతున్న అసహనం.. ఎమ్మెల్యేల విమర్శలు.. ఇటీవల విజయసాయిరెడ్డి వల్లే వైసీపీ నాశనం అవుతోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు చేసిన ఆరోపణలతో సీఎం జగన్ అలెర్ట్ అయినట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

    చేతులు కాలాక ఆకులు పట్టుకుంటావా.. జగన్?

    నేతలకు జగన్ ను విజయసాయిరెడ్డియే దూరం చేస్తున్నారనే వాదనలు వైసీపీలో ఎక్కువ అవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ తన కోటరీని ప్రక్షాళన చేశారని సమాచారం. విజయసాయిరెడ్డి స్థానంలో ఇక సజ్జల రామకృష్ణ రెడ్డిని నియమించారని.. పార్టీ, పాలనలో జగన్ తర్వాత ఇప్పుడు సజ్జలనే అందరూ నేతలు కలవాలని చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.

    ఇన్నాళ్లు జగన్ ను కలవడానికి ముందు విజయసాయిని అందరూ కలిసేవారు. కానీ విజయసాయి మాత్రం ఎవరిని జగన్ కలవాలో డిసైడ్ చేసేవారు. దాంతోనే అసమ్మతి చెలరేగిందని.. అందుకే ఆయనను జగన్ పక్కనపెట్టినట్టు తెలిసింది.

    ఏపీలో దారుణం.. మహిళా ఉద్యోగిపై అధికారి దాడి…

    ఇక సజ్జల పూర్తి భిన్నమైన వ్యక్తి అని.. నేతలు, కార్యకర్తల కష్టాలు వింటూ జగన్ కు వివరిస్తూ సమస్యలు పరిష్కరిస్తుంటారు. ఆ క్రమంలోనే తన కోటరీలో జగన్ రెండో స్థానాన్ని సజ్జలకు ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. సజ్జల క్షేత్రస్థాయిలో పరిస్థితులను జగన్ కు వివరిస్తూ తాజాగా ఎమ్మెల్యేలతోనూ మీటింగ్ ల ఏర్పాటుకు నిర్ణయించాడని.. పార్టీలో వచ్చిన ఈ మార్పునకు సజ్జలనే కారణమని అంటున్నారు.

    మొత్తంగా ఇన్నాళ్లు వైసీపీలో నంబర్2గా ఉన్న విజయసాయిరెడ్డి శకం ముగిసిందని.. జగన్ ఆయనను దూరం పెట్టారనే ప్రచారం ఆ పార్టీలో సాగుతోంది. ఇది నిజమా? అబద్ధమా అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.