Homeఆంధ్రప్రదేశ్‌జ‌గ‌న్‌ పాల‌న‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్‌ మ‌రో అస్త్రం.. సోష‌ల్ మీడియాలో పోస్టు వైర‌ల్

జ‌గ‌న్‌ పాల‌న‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్‌ మ‌రో అస్త్రం.. సోష‌ల్ మీడియాలో పోస్టు వైర‌ల్

సినిమా ఇండ‌స్ట్రీ విష‌యంలో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ప్ర‌సంగం సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. స‌మ‌స్య‌లు ప్ర‌స్తావిస్తూ.. వాటిని ప‌రిష్క‌రించ‌డంలో జ‌గ‌న్ స‌ర్కారు అనుస‌రిస్తున్న విధానాల‌ను దునుమాడారు. ‘రిప‌బ్లిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ సంధించిన విమర్శనాస్త్రాలు.. ఇంకా అలజడి రేపుతూనే ఉన్నాయి. ఇదిలా కొన‌సాగుతుండ‌గానే.. సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల బాణాలు సంధించారు జ‌న‌సేనాని.

ఇప్ప‌టికే.. ఏపీలో అభివృద్ధి కుంటుప‌డింద‌ని విమ‌ర్శ‌లు భారీగా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆదాయం సైతం స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌లేక‌పోతోందని, ఆ కార‌ణంగానే క‌నీసం జీతాలు కూడా స‌కాలంలో ఇవ్వ‌లేక‌పోతున్నార‌ని విప‌క్ష నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. నిజానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌తినెలా వేత‌నాల‌కోసం ఉద్యోగులకు ఎదురుచూపులు త‌ప్ప‌డం లేదు. ఇక‌, అప్పులు కూడా కుప్ప‌లు తెప్ప‌లుగా పెరిగిపోతూనే ఉన్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ వివ‌రాల‌న్నీ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన ప‌వ‌న్‌.. జ‌గ‌న్ పాల‌న‌పై ధ్వ‌జ‌మెత్తారు.

‘‘వైసీపీ ప్ర‌భుత్వం చేసిన వాగ్ధానాలు.. వాటిని అమ‌లు చెయ్య‌డంలో క‌నిపిస్తున్న క‌టిక నిజాలు’’ అనే పోస్టు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ ట్వీట్ కు ఒక ప‌ట్టిక‌ను జ‌త చేశారు. ఇందులో.. ఒక వైపు ఏపీ ప్ర‌భుత్వ వాగ్ధానాలు.. మ‌రో వైపు ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు ప‌వ‌న్‌. ఎన్నిక‌ల వేళ మ‌ద్యాన్ని నిషేధిస్తామ‌ని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌ద్యం ఆదాయాన్నే రుణాల‌కు భ‌ద్ర‌త‌గా మార్చుకుంద‌ని విమ‌ర్శించారు ప‌వ‌న్‌.

అదేవిధంగా.. క‌రెంటు ఛార్జీల‌ను త‌గ్గిస్తామ‌ని చెప్పి, భారీగా పెంచేశార‌ని పేర్కొన్నారు. సంక్షేమానికి నిధులు కేటాయిస్తామ‌ని చెప్పిన స‌ర్కారు.. బీసీ, ఎస్సీ ఎస్టీ స‌బ్ ప్లాన్ల‌కు నిధులు నిలిపేశార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని చెప్పార‌ని.. ఇప్పుడు మొత్తం నేరాల రేటు 63 శాతం పెరిగింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. ఇక‌, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని బాగు చేయ‌డం అటుంచితే.. దాదాపు 4 ల‌క్ష‌ల కోట్ల మేర అప్పులు చేశార‌ని మండిప‌డ్డారు. ఆ ప‌ట్టిక‌లో ఇంకా.. మ‌రెన్నో వివ‌రాల‌ను పోల్చి చూపారు ప‌వ‌న్‌. ఈ ట్వీట్ కు నెటిజ‌న్ల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version