Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: సర్జరీ తర్వాత తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చిన పవన్ కళ్యాణ్.. వీడియో...

Pawan Kalyan: సర్జరీ తర్వాత తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చిన పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..

Pawan Kalyan: రీసెంట్ గానే ముంబై లో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ , గత కొన్ని రోజుల నుండి హైదరాబాద్ లోని తన నివాసం లో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన్ని గవర్నర్ తో పాటు, ఇతర రాజకీయ నాయకులూ , సినీ ప్రముఖులు కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు మూడు నుండి నాలుగు వారాల వరకు విశ్రాంతి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కి సూచించారు. కానీ నాదెండ్ల మనోహర్ రీసెంట్ గానే జరిగిన ఒక కార్యక్రమం లో మరో మూడు రోజుల్లోనే పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయ్యింది. అప్పుడే ఎందుకు , మూడు వారాలు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ని సోషల్ మీడియా లో రిక్వెస్ట్ చేశారు.

కానీ ఆయనకు పనులు చేసుకోగలను అనే మనోధైర్యం రావడంతో , నేడు విజయవాడ కి చేరుకొని , పాలన పరమైన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఆయన విజయవాడ కి చేరుకున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కార్యకర్తలు, జనసేన నేతలు పవన్ కళ్యాణ్ కి భారీ లెవెల్ లో స్వాగతం పలికారు. ఆ వీడియో ని మీరు క్రింద చూడొచ్చు. దీనిని బట్టీ అర్థం అవుతుంది ఏమిటంటే , అనవసరంగా పవన్ కళ్యాణ్ పాలన విషయం లో సమయాన్ని వృధా చేయడు అని. ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ , కాస్త అవకాశం ఉన్నా కూడా ఆయన కార్యక్రమాల్లో పాల్గొంటారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు పిఠాపురం లో పర్యటించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అధికారులు.

ఇప్పటికే పిఠాపురం లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ఎన్నో ఏళ్ళ నుండి గతుకుల రోడ్లలో , గుంతల మాయమైపోయింది రోడ్లలోనే పిఠాపురం జనాలు ప్రయాణం చేస్తూ రావాల్సి వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం లో అద్దం లాంటి రోడ్లు విరిశాయి. అంతే కాకుండా , డంపింగ్ యార్డ్ ని పార్క్ గా మార్చడం, వంద పడకల హాస్పిటల్ నిర్మాణం , రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం , ఇలా ఒక్కటా రెండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మునుపెన్నడూ లేని విధంగా పిఠాపురం లో చోటు చేసుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో పిఠాపురం ఇంకా ఎంత అభివృద్ధి చెందుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version