Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతూనే ఉంది. అటు రాజకీయంగా ఇటు సినిమా వాళ్ళ మధ్యన పెద్ద దుమారమే రేపింది. ముఖ్యంగా వైఎస్సార్సీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందిస్తూ విమర్శలు చేశారు. మరోపక్క పవన్.. మీడియా పై కూడా కామెంట్స్ చేయడంతో అటు కొన్ని మీడియా సంస్థలు పవన్ పై వ్యంగ్యంగా పేరడీ సాంగ్స్ చేసి వదులుతున్నాయి.

దీనికి తోడు పవన్ స్పీచ్ సినిమా ఇండస్ట్రీని కూడా చీల్చింది. పవన్ కళ్యాణ్ స్పీచ్ కి మద్దతుగా నాని, కార్తికేయ, సంపూర్ణేష్ బాబు వంటి చిన్నాచితకా హీరోలు తప్ప, ఏ స్టార్ హీరో మద్దతు పలకడానికి ముందుకు రాలేదు. కనీసం సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెట్టడానికి కూడా మన హీరోలు ఆసక్తి చూపించలేదు. ఎందుకు మిగతా హీరోలు మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు అనేది పవన్ కళ్యాణ్ సన్నిహితులు అడుగుతున్న ప్రశ్న.
ఏ స్టార్ అయినా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తే.. వారిపై వారి సినిమాల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ ఆంక్షలు విధిస్తుందనే భయం సినిమా వాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తుంది. దీనికితోడు పవన్.. బాలయ్య పై ఇన్ డైరెక్ట్ గా సిల్లీ కామెంట్స్ చేయడం, అటు మోహన్ బాబు పై డైరెక్ట్ కామెంట్స్ చేయడం కూడా చాలా మందికి నచ్చలేదు.
బాలయ్య అంటే ఇష్టం చూపించే వర్గం ఇండస్ట్రీలో ఉంది. అందుకే ఈ నేపథ్యంలోనే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున నారాయణ దాస్ నారంగ్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆ లెటర్ లో సారాంశం.. తెలుగు సినిమా పరిశ్రమకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు కూడా పరిశ్రమ చేసిన వినతులకి సానుకూలంగా ఉన్నారు. అంటూ లెటర్ లో మ్యాటర్ ఉంది. అంటే.. ఈ లెటర్ పక్కగా పవన్ స్పీచ్ కి వ్యతిరేఖంగా సాగింది. మొత్తానికి ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసే వారి కంటే వ్యతిరేకించే వారే ఎక్కువగా ఉన్నారు. అయినా స్టార్ హీరోలకు ఆన్ లైన్ టికెట్ల విధానం పై తమ అభిప్రాయాన్ని ఒక ట్వీట్ చేసే ధైర్యం కూడా లేదా ?