Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: ఏపీ పై పవన్ ఫోకస్ .. ఆరోజు కీలక నిర్ణయాలు

Pawan Kalyan: ఏపీ పై పవన్ ఫోకస్ .. ఆరోజు కీలక నిర్ణయాలు

Pawan Kalyan: ఏపీ రాజకీయాలపై పవన్ ఫోకస్ పెట్టమన్నారు. వీలైనంత త్వరగా పెండింగ్ సినిమాలను పూర్తి చేసి పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. ఎన్నికలకు పట్టుమని మూడు నెలల వ్యవధి కూడా లేదు. ఫిబ్రవరిలో షెడ్యూల్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి.. ఏప్రిల్ లో ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ అప్రమత్తమయ్యారు. డిసెంబర్ నుంచి దాదాపు ఆరు నెలల పాటు ప్రజాక్షేత్రంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో బిజెపితో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఎనిమిది సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేకుండా ఏపీపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టేందుకు పవన్ డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 1న జనసేన విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. పవన్ తో పాటు డీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సైతం హాజరు కానున్నారు.ఎన్నికల వ్యూహాలను రూపొందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ స్థితిగతులను చర్చించనున్నారు.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో సమన్వయ కమిటీల సమావేశాలు పూర్తయ్యాయి. ఇరు పార్టీల శ్రేణులు ఐక్యతగా ముందుకు వెళుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పొత్తు విచ్ఛిన్నానికి వైసిపి ప్రయత్నాలు చేస్తోంది. రెండు పార్టీల మధ్య చిన్నపాటి తగాదాలను సైతం భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తుంది. దీనికి చెక్ చెప్పే విధంగా పవన్ ప్రత్యేక వ్యూహం రూపొందించుకున్నట్లు సమాచారం. కేవలం వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకుండా శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జనసేన టిడిపి క్షేత్రస్థాయిలో సమన్వయంతో చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాటర్ జాబితాల పరిశీలన తదితర విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

జనసేన ప్రతిపాదించే సీట్లు, పొత్తులో అడగాల్సిన స్థానాలపై సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉండగా.. అందులో జనసేనకు ఉన్న బలాబలాలు.. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలు.. అక్కడ పార్టీ శ్రేణుల ఆకాంక్షలు.. సీట్ల సర్దుబాటు… ఓట్ల బదలాయింపు.. పార్టీలో ధిక్కారస్వరాలపై తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సమావేశంపై జనసేన నాయకత్వం ప్రత్యేక అజెండా రూపొందించినట్లు సమాచారం. ఈ విస్తృత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...
Oktelugu Epaper
Exit mobile version