Homeజాతీయ వార్తలుDharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నరేంద్ర మోడీ పేరు తెచ్చుకున్నారు. అటువంటి మోడీని సైతం ఇబ్బంది పెట్టగలిగారు నేటి యువత. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ విషయంలో యువత కేంద్రం మీద విపరీతమైన ఆగ్రహంతో ఉంది. ఆ ఆగ్రహమే ఇంతటి దానికి కారణమైంది.

యువత ఉద్యమాన్ని చేయడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖలో వైఫల్యాలకు తానే ప్రధాన కారణమంటూ ధర్మేంద్ర పేర్కొన్నారు. యువత ఆకాంక్షలకు తాను గౌరవం ఇస్తున్నట్టు ప్రకటించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.

మనదేశంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన వారిలో ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే తొలివాడు కాదు. ధర్మేంద్ర ప్రధాన్ కంటే ముందు చాలామంది మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. తమ శాఖలలో జరిగిన ప్రమాదాలు.. కుంభకోణాల ఇటువంటి ఘటనలకు బాధ్యత వహించి రాజీనామాలు చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్

నీట్ పేపర్ లీకేజీ విషయంలో బాధ్యత వహిస్తూ.. ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.. పేపర్ లీకేజీ విషయంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సోనం వాంగ్ చుక్ దీక్ష చేశారు. అది కాస్త హింసాత్మకంగా మారడం.. యువత ఢిల్లీ వీధులలోకి వచ్చి పోరాటం చేయడం.. వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.

సురేష్ ప్రభు, రైల్వే మంత్రి, 2017

నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో రైల్వే శాఖ మంత్రిగా సురేష్ ప్రభు పని చేసేవారు. నాడు వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో.. ఆ ఘటనలకు తాను బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఈ శాఖను నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పియూష్ గోయల్ కు అప్పగించారు.

శివరాజ్ పాటిల్.. హోం శాఖ మంత్రి.. 2008

యూపీఏ ప్రభుత్వం తొలి దశలో అధికారంలో ఉన్నప్పుడు.. ముంబై మహానగరంలో ఉగ్రదాడులు జరిగాయి. దీనికి కారణం భద్రతాపరమైన లోపాలు అని భావించిన పాటిల్.. నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తొలగిపోయారు.

మమతా బెనర్జీ.. రైల్వే శాఖ మంత్రి 2000

నాడు కేంద్రంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ.. వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. అయితే నాడు ఆమె రాజీనామాను ప్రధానమంత్రి వాజ్ పేయి ఒప్పుకోలేదు.

నితీష్ కుమార్, రైల్వే శాఖ మంత్రి, 1999

వాజ్ పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నితీష్ కుమార్ రైల్వే మంత్రిగా పనిచేశారు. 1999లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గైసల్ ప్రాంతం వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నాడు 200 మంది చనిపోయారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ పదవి నుంచి తప్పుకున్నారు.

మాధవరావు సింధియా.. పౌర విమానాయన శాఖ మంత్రి.. 1993

ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక అభిమానం ప్రమాదానికి గురైంది. దీంతో ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ మాధవరావు తన పదవికి రాజీనామా చేశారు.

కృష్ణ మేనన్, రక్షణ శాఖ మంత్రి, 1962

1962లో భారత్, చైనా మధ్య యుద్ధం జరిగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కృష్ణ మేనన్ తన పదవికి రాజీనామా చేశారు.

కృష్ణమాచారి, ఆర్థిక శాఖ మంత్రి 1958

స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో దేశంలో ముంద్రా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా కృష్ణమాచారి పనిచేస్తున్నారు. కోల్కతా నగరానికి చెందిన హరిదాసు ముంద్రా అనే వ్యక్తికి సంబంధించిన కంపెనీ షేర్లను కొనుగోలు చేయడానికి ఎల్ఐసి నిధులను దారి మళ్ళించారు. ఆ కంపెనీలో ఎల్ఐసి 1.26 కోట్లను ఇన్వెస్ట్ చేసి తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో కృష్ణమాచారి పదవికి రాజీనామా చేశారు.

లాల్ బహుదూర్ శాస్త్రి, రైల్వే శాఖ మంత్రి, 1956

తమిళనాడు రాష్ట్రంలోని అరియలురు వద్ద దారుణమైన రైలు ప్రమాదం జరిగింది. 140 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ శాస్త్రి రాజీనామా చేశారు.

ఇక 2018లో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఎంజే అక్బర్ కొనసాగారు. నాడు ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...
Oktelugu Epaper
Exit mobile version