Homeఆంధ్రప్రదేశ్‌JD Lakshmi Narayana: ఏపీలో జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ?

JD Lakshmi Narayana: ఏపీలో జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ?

JD Lakshmi Narayana: ఏపీలో మరో కొత్త పార్టీ పురుడుపోసుకోనుందా? ఇప్పుడున్న పార్టీలు చాలా ఉన్నట్టు కొత్త పార్టీ తెరపైకి రానుందా? అటువంటి రాజకీయ శూన్యత రాష్ట్రంలో ఉందా? అన్న చర్చ బలంగా నడుస్తుంది. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంతటా ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. విశాఖ ఎంపీ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తానని.. అవసరమైతే సొంతంగా పార్టీ పెట్టుకుంటానని జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించడం విశేషం.

అక్రమాస్తుల కేసుల విచారణతో జేడీ లక్ష్మీనారాయణ జాతీయ వ్యాప్తంగా సుపరిచితులయ్యారు. ముఖ్యంగా జగన్ అక్రమస్తుల కేసులను విచారణ చేపట్టింది జేడీ లక్ష్మీనారాయణే. గత ఎన్నికల ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సరిగ్గా ఎన్నికలకు 15 రోజుల ముందు జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు. ఎన్నికల అనంతరం జనసేన ను వీడారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

రానున్న ఎన్నికల్లో విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని చాలా సందర్భాల్లో జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.ఏదైనా రాజకీయ పార్టీ టిక్కెట్ ఇస్తే బరిలో దిగుతానని.. లేకుంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల వైసిపి ప్రభుత్వ చర్యలను అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు.జగన్ సర్కార్ చేపడుతున్న పనులను మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో జేడీ లక్ష్మీనారాయణ వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అటువంటి సంకేతాలు ఏవి ఇవ్వలేదు. అలాగని పొలిటికల్ పార్టీలో అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.

అయితే తిరిగి జనసేనలో చేరతారని ఓ టాక్ నడిచింది. అయితే గత ఎన్నికల తర్వాత పవన్ తో తనకు సెట్ కాదని లక్ష్మీనారాయణ ప్రకటించారు. పార్టీని వీడారు. అయితే ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని తిరిగి జనసేనలో చేరతానన్న మీమాంసలో జేడీ ఉన్నట్లు తెలుస్తోంది. పైగా విశాఖ లోక్సభ స్థానానికి విపరీతమైన పోటీ ఉంది. అటు టిడిపి, ఇటు జనసేన, కలిసి వస్తే బిజెపిల నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు.ఈ తరుణంలో ఏ పార్టీలో అవకాశం లేకపోవడంతో జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పల్లవి అందుకున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉన్న పార్టీలకే దిక్కు లేదు.. ఎన్నికల ముంగిట కొత్త పార్టీ పెడితే మాత్రం పెద్దగా వర్క్ అవుట్ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version