Gold: ఇంట్లో ఎంత వరకు బంగారం నిల్వ చేసుకోవచ్చు.. ఎక్కువ ఉంటే ఏమవుతుంది?

బంగారం ధరలు రోజరోజుకు పెరుగుతున్నా.. దాని కొనుగోలుకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ఆభరణాల ధరించడానికి, వ్యాపారం చేయడానికి బంగారం కొనుగోలు చేస్తుంటారు.

Written By: Chai Muchhata, Updated On : November 29, 2023 3:26 pm

Gold

Follow us on

Gold: భారత్ లో బంగారానికి డిమాండ్ ఎక్కువ. మహిళలతో పాటు కొందరు మగవారు కూడా బంగారు ఆభరణాలు శరీరంపై ఉండాలనుకుంటారు. దీంతో ఆభరణ రూపంలో ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తారు. కాస్త డబ్బున్న వారు ఎక్కువ గోల్డ్ ను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇండియా బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఉండాల్సిన దానికన్నా డబ్బు ఎక్కువగా ఉంటే ఐటీ రైడ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ బంగారం ఎక్కువగా ఉన్నా.. ఐటీవాళ్లు వచ్చి తీసుకుపోతుంటారు. నగదు అంటే సాలరీ, ఇతర ఆదాయాలకు అనుగుణంగా పరిమితి ఉండాలని సూచిస్తుంది. మరి ఒక ఇంట్లో బంగారం ఎంత నిల్వ చేసుకోవచ్చు? అంతకుమించి ఎక్కువగా ఉంటే ఏమవుతుంది?

బంగారం ధరలు రోజరోజుకు పెరుగుతున్నా.. దాని కొనుగోలుకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ఆభరణాల ధరించడానికి, వ్యాపారం చేయడానికి బంగారం కొనుగోలు చేస్తుంటారు. సాధారణంగా ఒక కుటుంబంలో ఆడవాళ్లు ఉంటే వారు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. కొత్తగా పెళ్లయిన యువతులు పుట్టింటి నుంచి బంగారం తీసుకొస్తారు. ఇలా రకరకాలుగా పరిమితికి లోబడి బంగారం ఉంటే ఎలాంటి సమస్య ఉండదు ఒకవేళ ఐటీ రైడ్స్ జరిగినా నిబంధనలకు లోబడి బంగారం ఉంటే ఎటువంటి ఫైన్ ఉండదు. కానీ వారు నిర్ణయించిన దానికంటేఎక్కువగా ఉంటే అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకీ ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే?

ఒక ఇంట్లో పెళ్లయిన మహిళకు సంబందించి 500 గ్రాముల బంగారం ఉండొచ్చు. అలాగే మగవారు ధరించాలనుకుంటే 100 గ్రాముల బంగారం నిల్వ చేసుకోవచ్చు. ఆ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే వారి భవిష్యత్ కోసం బంగారం ను నిల్వ చేసుకోవచ్చు. అలా ఒక్కొక్కరికి సంబంధించి 250 గ్రాముల చొప్పున మొత్తం 500 గ్రాముల బంగారం ఉండొచ్చు. ఇలా మొత్తం ఒక కుటుంబంలో 1100 గ్రాముల బంగారంను నిల్వ చేసుకోవడానికి అనుమతి ఉంది.

అయితే ఇంతకన్నా ఎక్కువ బంగారం ఉన్నా.. లేక ఆభరణాలు కాకుండా ఇతర రూపంలో ఉన్నా ఐటీ రైడ్స్ అయతే వారికి ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అంటే అనుమతి లేని బంగారం ఎంత ఉంటుందో దాని విలువలో 70 శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలాగే 18 శాతం ఫెనాల్టీ .. ఇలా మొత్తం 88 శాతం వరకు బంగారం వాల్యూకు సంబంధించిన నగదును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల అవసరమైన మేరకు బంగారం మాత్రమే ఉంటే ఎటువంటి సమస్య ఉండదు.