Homeఎంటర్టైన్మెంట్Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్ గా నిలుపుతాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘నూటన్స్ థర్డ్ లా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈనెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. 1999 వ సంవత్సరంలో జరిగే కథ గా తెలుస్తుంది. మర్డర్ మిస్టరీకి సంబంధించిన ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ అయితే ఉంది. ప్రతి సన్నివేశం కూడా చాలా ఎగ్జైటింగ్ గా మలిచినట్టుగా తెలుస్తుంది. విజువల్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అయితే ఉన్నాయి. సుమంత్ మళ్లీ ఒక మిస్టరీ ని కనుగొనే పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఆయన ఈ పాత్రలో కూడా చాలా డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ప్రతి సినిమాతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవడానికి ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. కాబట్టి మరోసారి ఈ సినిమా అతనికి మరో సక్సెస్ ని సాధించిపెట్టే అవకాశాలైతే ఉన్నాయి. దర్శకుడు ఈ సినిమాని చాలా ఇంటెన్స్ తో తీసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కుర్రాళ్లను కొందరు కావాలనే డబ్బు ఆదా చూపించి వాళ్ళతో ఇల్లీగల్ పనులు చేయిస్తున్నట్టుగా కనిపిస్తుంది.

ఇక ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్లు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది… ప్రతి షాట్ ని కూడా చాలా ప్రాపర్ గా వాడుకున్నట్టుగా ట్రైలర్ ను చూస్తే కనిపిస్తుంది. జగపతిబాబు మరోసారి ఒక డిఫరెంట్ రోల్ లో మనకు కనిపించబోతున్నాడు… మొత్తానికైతే ఈ సినిమా ఇంతకుముందు వచ్చిన థ్రిల్లర్ సినిమాలన్నింటికంటే కూడా డిఫరెంట్ గా ప్రజెంట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

టైటిల్ లోనే కొత్తదనం అయితే దాగుంది. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కొత్తగా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… అంత బాగానే ఉన్నప్పటికి సుమంత్ ట్రైలర్లో ఎక్కువ సేపు అయితే కనిపించలేదు. ఆయన ఇప్పటి వరకు పోషించిన అన్ని పాత్రల్లో ఇది మంచి పాత్ర గా నిలువబోతున్నట్టుగా తెలుస్తుంది…
Newton's 3rd Law Official Trailer | Sumanth | Jagapathi Babu | Rajesh Karna | In Theatres July 31

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...
Oktelugu Epaper
Exit mobile version