Pawan Kalyan: పవన్ మరోసారి రంగంలోకి దిగారు. ఈసారి యూత్ విషయంలో గట్టిగానే ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీలో నిరుద్యోగుల సమస్యలపై ఆయన స్పందించారు. రీసెంట్ గా నిరుద్యోగులు కలెక్టరేట్లను ముట్టడిస్తే వారిని ఈడ్చుకెళ్లడం సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. కాగా ఈ విషయంపై పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఉద్యోగాలు ఇవ్వడం అంటే మీ వాళ్లకు సలహాదారుల పోస్టులు ఇవ్వడం కాదంటూ సెటైర్ వేశారు.

ఎన్నికల సమయంలో లేనిపోని హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయాలంటే తప్పించుకోవడం ఏంటని మండిపడ్డారు. గతంలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న జగన్ హామీ ఏమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు జాబులతో పాటు 25 వేల టీచర్ జాబులు ఇస్తామంటూ ముద్దులు పెట్టి చెప్పారని, ఇప్పుడు అతీ గతీ లేదంటూ సెటైర్లు వేశారు పవన్ కల్యాణ్.
Also Read: అలిగిన ‘మంచు’ ఫ్యామిలీని జగన్ ఓదార్చారా?
కాగా పవన్ కల్యాణ్ యూత్ తరఫున మాట్లాడటం మంచి పనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగ యువకులు ఇప్పుడు ఏపీలో చాలా ఆశతో ఎదరు చూస్తున్నారు. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా రావట్లేదు. ఈ సమయంలో వారి తరుఫున పవన్ గనక ఏదైనా నిరసన, లేదంటే దీక్ష చేస్తే మరింత మేలు చేకూరుతుంది. అటు పార్టీతో పాటు ఇటు యువతకు కూడా మేలు చేసిన వాడు అవుతాడు పవన్.
ఈ రోజుల్లో యూత్‌లో ఒక పార్టీ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది అంటే ఆ పార్టీకి తిరుగుండదు. ఇప్పుడు పవన్ కూడా ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ఏ విషయంలో అయినా కాస్త లేటుగానే స్పందించే పవన్.. నిరుద్యోగుల విషయంలో మాత్రం చాలా స్పీడుగా రియాక్ట్ కావడం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదేమైనా కూడా పవన్ ఇలా నిరుద్యోగులను తన వైపుకు తిప్పుకునే పనిలో ఒక మెట్టు ఎక్కారనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో మరింత ముందుకు వెళతారా లేదంటే ఇక్కడితోనే వదిలేస్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ఒకవేళ ముందుకు వెళ్లి నిరసనలు, దీక్షలు లాంటివి చేస్తే మాత్రం ఆయనకు తిరుగుండదేమో.
Also Read: చిక్కుల్లో మంత్రి అప్పలరాజు.. పోలీసు అధికారిపై దుర్భషలాడటంపై సర్వత్రా విమర్శలు..!
[…] Also Read: నిరుద్యోగుల సమస్యపై గళం విప్పిన … […]
[…] Also Read: నిరుద్యోగుల సమస్యపై గళం విప్పిన … […]