Deepthi Sunaina Shanmukh Breakup: యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్, దీప్తి సునయన అంటే యూత్ లో యమ క్రేజ్ ఉంది. పైగా వీరిద్దరూ లవర్స్ గా ఉండటంతో వీరి జంటకు మరింత క్రేజ్ వచ్చి పడింది. ఇద్దరికీ యూ ట్యూబ్ లో పెద్ద ఛానెల్స్ ఉన్నాయి. వారు తీసే వెబ్ సిరీస్‌లకు మిలియన్‌ల కొద్దీ వ్యూస్ వచ్చేవి. కానీ వీరి గురించి మీడియాలో పెద్దగా ఎప్పుడూ ప్రచారం జరగలేదు. కానీ ఎప్పుడైతే షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్-5 లోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పుడే ఇద్దరి గురించి అంతటా రచ్చ మొదలైంది.

ఇక హౌస్ లో షణ్ముఖ్, సిరిల రొమాన్స్ అయితే హద్దులు దాటి పోయింది. నిత్యం హగ్గులు, కిస్సులు అంటూ రచ్చ రచ్చ చేశారు. ఇక దీనిపై అటు సోషల్ మీడియాలో, ఇటు మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. దీప్తి సునయనను, అటు సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్‌ను ట్యాగ్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. అయినా సరే వారిద్దరూ షణ్ముఖ్, సిరిలపై ఎలాంటి రియాక్షన్ కాలేదు.

పైగా వారిద్దరికీ మంచి సపోర్టు ఇచ్చారు. నిజానికి షణ్ముఖ్, సిరి ఫైనల్ వరకు వెళ్లారంటే దానికి కారణం బయట నుంచి దీప్తి, శ్రీహాన్ ఇచ్చిన సపోర్టు చాలా ముఖ్యం. కాగా షణ్ముఖ్, సిరిలు మాత్రం ఇది అర్థం చేసుకోకుండా మరింత రెచ్చిపోవడంతో అంతటా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దీప్తి బ్రేకప్ చెప్పబోతోందంటూ వార్తలు వచ్చాయి.
Also Read: యాంకర్ సుమ రేర్ ఫొటోలు మీకోసం.. చిన్నప్పుడు, పెండ్లిలో ఎలా ఉందో చూడండి..!

అందరూ ఊహించనట్టు గానే దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. ఇందుకు బలమైన కారణం ఉందంట. దీప్తి తల్లిదండ్రులు హౌస్ లో షణ్ముఖ్, సిరిల రొమాన్స్ చూసి సీరియస్ అయ్యారంట. అతనితో విడిపోవాలంటూ దీప్తికి వార్నింగ్ ఇచ్చారంట. లేకపోతే తమనుంచి విడిపోవాలంటూ కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో చేసేది లేక దీప్తి పేరెంట్స్ కోసం షణ్ముఖ్‌తో విడిపోయినట్టు తెలుస్తోంది.
Also Read: ఈవీవీ లైఫ్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ బడ్జెట్ కేవలం రూ.50 లక్షలు… వచ్చింది 2 కోట్లు.. ఏదో తెలుసా?
[…] Also Read: షణ్ముఖ్ తో దీప్తి విడిపోవడానికి వాళ… […]