spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: నిరుద్యోగుల స‌మ‌స్య‌పై గ‌ళం విప్పిన ప‌వ‌న్‌.. ఇదే జోష్‌తో ముందుకెళ్తారా..?

Pawan Kalyan: నిరుద్యోగుల స‌మ‌స్య‌పై గ‌ళం విప్పిన ప‌వ‌న్‌.. ఇదే జోష్‌తో ముందుకెళ్తారా..?

Pawan Kalyan: ప‌వ‌న్ మ‌రోసారి రంగంలోకి దిగారు. ఈసారి యూత్ విష‌యంలో గ‌ట్టిగానే ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం ఏపీలో నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న స్పందించారు. రీసెంట్ గా నిరుద్యోగులు క‌లెక్ట‌రేట్ల‌ను ముట్ట‌డిస్తే వారిని ఈడ్చుకెళ్ల‌డం సోష‌ల్ మీడియాలో ఎంత‌లా వైర‌ల్ అయిందో అంద‌రికీ తెలిసిందే. కాగా ఈ విష‌యంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఉద్యోగాలు ఇవ్వ‌డం అంటే మీ వాళ్ల‌కు స‌ల‌హాదారుల పోస్టులు ఇవ్వ‌డం కాదంటూ సెటైర్ వేశారు.

Pawan Kalyan
Pawan Kalyan

ఎన్నిక‌ల స‌మ‌యంలో లేనిపోని హామీలు ఇచ్చి, వాటిని అమ‌లు చేయాలంటే త‌ప్పించుకోవ‌డం ఏంట‌ని మండిప‌డ్డారు. గ‌తంలో జాబ్ క్యాలెండ‌ర్ ఇస్తామ‌న్న జ‌గ‌న్ హామీ ఏమైందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసు జాబుల‌తో పాటు 25 వేల టీచర్ జాబులు ఇస్తామంటూ ముద్దులు పెట్టి చెప్పార‌ని, ఇప్పుడు అతీ గతీ లేదంటూ సెటైర్లు వేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

Also Read: అలిగిన ‘మంచు’ ఫ్యామిలీని జగన్ ఓదార్చారా?

కాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ యూత్ త‌ర‌ఫున మాట్లాడ‌టం మంచి ప‌నే అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగ యువ‌కులు ఇప్పుడు ఏపీలో చాలా ఆశ‌తో ఎద‌రు చూస్తున్నారు. కానీ ఒక్క నోటిఫికేష‌న్ కూడా రావ‌ట్లేదు. ఈ స‌మ‌యంలో వారి త‌రుఫున ప‌వ‌న్ గ‌న‌క ఏదైనా నిర‌స‌న, లేదంటే దీక్ష చేస్తే మ‌రింత మేలు చేకూరుతుంది. అటు పార్టీతో పాటు ఇటు యువ‌త‌కు కూడా మేలు చేసిన వాడు అవుతాడు ప‌వ‌న్‌.

ఈ రోజుల్లో యూత్‌లో ఒక పార్టీ మీద మంచి అభిప్రాయం ఏర్ప‌డింది అంటే ఆ పార్టీకి తిరుగుండ‌దు. ఇప్పుడు ప‌వ‌న్ కూడా ఇదే విష‌యాన్ని ఫాలో అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఏ విష‌యంలో అయినా కాస్త లేటుగానే స్పందించే ప‌వ‌న్‌.. నిరుద్యోగుల విష‌యంలో మాత్రం చాలా స్పీడుగా రియాక్ట్ కావ‌డం అంద‌రినీ ఒకింత ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఏదేమైనా కూడా ప‌వ‌న్ ఇలా నిరుద్యోగుల‌ను త‌న వైపుకు తిప్పుకునే పనిలో ఒక మెట్టు ఎక్కార‌నే చెప్పుకోవ‌చ్చు. మ‌రి ఈ విష‌యంలో మ‌రింత ముందుకు వెళ‌తారా లేదంటే ఇక్క‌డితోనే వ‌దిలేస్తారా అన్న‌ది మాత్రం వేచి చూడాల్సిందే. ఒక‌వేళ ముందుకు వెళ్లి నిర‌స‌న‌లు, దీక్ష‌లు లాంటివి చేస్తే మాత్రం ఆయ‌న‌కు తిరుగుండ‌దేమో.

Also Read: చిక్కుల్లో మంత్రి అప్ప‌ల‌రాజు.. పోలీసు అధికారిపై దుర్భ‌ష‌లాడ‌టంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు..!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper