Pawan Kalyan- Governor: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు ఉత్తాంధ్ర కేంద్రం గా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఉత్తరాంధ్ర లో మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న జనవాణి కార్యక్రమాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అక్రంగా ఆపడం..జనసేన పార్టీ నాయకులను అరెస్ట్ చెయ్యడం..అలాగే కార్త్యకర్తలపై అడ్డమైన కేసులు బనాయించడం ఇవ్వన్నీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది..పవన్ కళ్యాణ్ కి సంగీభావంగా అభిమానులు గత రెండు రోజుల నుండి నోవొటెల్ హోటల్ వద్దనే తిష్ట వేశారు..పోలీసులు వాళ్ళని ఎంతలా చెదరగొట్టిన ఏ మాత్రం వెన్ను చూపకుండా ఇప్పటికి అక్కడే ఉన్నారు.

ఒక ఆడబిడ్డ తన బిడ్డలతో పాటుగా రోడ్డు మీద కూర్చొని పవన్ కళ్యాణ్ కి సంగీభావం తెలుపుతున్న వీడియో సోషల్ మీడియా అంతటా హల్చల్ చేస్తోంది..ఇది ఇలా ఉండగా ఈరోజు 65 మంది జనసేన పార్టీ కార్యకర్తలను బైలు మీద విడిపించారు పవన్ కళ్యాణ్..9 మంది లీడర్లు ఇంకా రేమండ్ లోనే ఉన్నారు..సాయంత్రం లోపు వీళ్ళందరినీ విడుదల చేయించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇది ఇలా ఉండగా ఈరోజు పవన్ కళ్యాణ్ గవర్నర్ ని కలవడానికి అప్పోయింట్మెంట్ కోరారు..గవర్నర్ గారు అప్పోయింట్మెంట్ ఇవ్వగానే వైజాగ్ నుండి విజయవాడ కి వెళ్లి పవన్ కళ్యాణ్ కలవనున్నారు..అక్రమంగా తమ కార్యకర్తల మీద మరియు తమ పార్టీ నాయకుల మీద అడ్డదిడ్డంగా ప్రభుత్వం పెట్టిన కేసులను గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లనున్నారు పవన్ కళ్యాణ్..అంతే కాకుండా అకారణంగా శాంతియుతంగా జరుపుకోవాల్సిన జనవాణి కార్యక్రమాన్ని ఎలాంటి కారణం లేకుండా ఈ నెల 31 వరుకు జరుపుకోరాదని ప్రభుత్వం తమకి 41A నోటీసు ఇచ్చిందనే విషయాన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాబోతున్నారు పవన్ కళ్యాణ్.

ప్రభుత్వం పెట్టిన ఈ కేసులన్నీ అక్రమం కాబట్టి వాటిని కొట్టివేసే ఛాన్స్ కూడా ఉంది..అంతే కాకుండా ఉత్తరాంధ్ర లో జరగాల్సిన జనవాణి కార్యక్రమానికి కూడా అనుమతి లభించే అవకాశం ఉంది..పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మధ్య జరుగుతున్న ఈ పోరు లో చివరికి విజయం ఎవరు సాధించబోతున్నారో చూడాలి.