Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ‘వారాహి విజయ యాత్ర’ కి అద్భుతమైన స్పందన లభిస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కి అడుగడుగునా జనాలు నీరాజనం పలుకుతున్నారు. ప్రతీ నియోజకవర్గం లో ఆయన నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో చర్చలు, వీటి ద్వారా ఆయా ప్రాంతాలలో ఉన్న సమస్యలను వెలికితీస్తూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు ప్రతీ ఒక్కరికీ ఎంతో బాగా నచ్చుతుంది.
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఆయన వైపు చూడడం ప్రారంభించారు. ఆయన ప్రసంగాలను విని ఎవరు ఎలాంటి వాళ్ళు అనే విషయాన్నీ చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ ప్రభుత్వం వస్తే ఎలాంటి పధకాలను ప్రవేశ పెడుతామో పవన్ కళ్యాణ్ వివరించిన తీరు మేధావులకు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య శ్రీ స్కాం గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘ ప్రతి కుటుంబం కి ఇన్సూరెన్స్ చేస్తే , ఆ హాస్పిటల్ ఖర్చులు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. ప్రభుత్వం కేవలం ప్రీమియం కడితే చాలు.అటు ప్రభుత్వానికి డబ్బు ఆదా, ఇటు ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కూడా దొరుకుతుంది’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ పాలసీ కి అందరూ బాగా కనెక్ట్ అయ్యారు.
దీనిపై నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజన్ ఉన్న నాయకుడి ఆలోచనలు ఇలా గొప్పగా ఉంటాయి. ప్రతీ పైసానీ పొదుపుగా వాడుతూ, జనం కడుతున్న టాస్కులకు జవాబుదారి తనం గా ఉండడమే నిజమైన నాయకుడికి ఉండాల్సిన లక్షణం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో పక్క ప్రసంగం చివర్లో ‘హలో ఏపీ, బై బై వైసీపీ’ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన నినాదం కూడా సోషల్ మీడియా లో ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.