Pawan Kalyan Varahi Yatra: పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న జనసేన ‘వారాహి విజయయాత్ర’ కి జనం నుండి అద్భుతమైన స్పందన లభిస్తుంది. రోజు రోజు కి ఈ యాత్ర కి పెరుగుతున్న క్రేజ్ ని చూసి అధికార వైసీపీ పార్టీ కి గుండెల్లో గుబులు పుడుతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో యాత్ర చేపడుతున్నప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచింది కానీ, ఓట్లు పడలేదు.
కానీ ఈసారి మాత్రం జనాల ఉత్సాహం చూస్తూ ఉంటే కచ్చితంగా ఓట్లు వేస్తారనే అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ అనుకుంటున్నారు. దానికి తోడు ఈమధ్య ఆఫ్ లైన్ లో మరియు ఆన్లైన్ లో ఇతర హీరోల అభిమానుల నుండి జనసేన పార్టీ కి అద్భుతమైన సపోర్టు లభిస్తుంది.జనసేన పార్టీ కి మునుపెన్నడూ కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ ఇతర హీరోల అభిఉమానుల రాలేదని, ఇదే మొట్టమొదటిసారి అని అంటున్నారు విశ్లేషకులు.
ఇక పవన్ కళ్యాణ్ సభలలో అభిమానులు ఎంత ఊపులో ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమాలను రాష్ట్ర ప్రభుత్వం అతి దారుణంగా తొక్కుతున్న సమయం లో థియేటర్స్ లో తమ ఆగ్రహం ని చూపించేందుకు ‘అరటి పండు తొక్క..జగన్ అన్న బొ**’ అనే నినాదం ని కనిపెట్టారు.
నిన్న జరిగిన సభలో కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నప్పుడు ‘అరటిపండు తొక్క’ అనే నినాదం తో సభని హోరెత్తించారు, ఇది గమనించిన పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘ రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టించడం నా ఉద్దేశ్యం కాదు, దయచేసి అతనిని తిట్టకండి, మీరు తిట్టడం ఆపేసి, ఆ ముఖ్యమంత్రికి ఓట్లు వెయ్యడం మానేయండి, అంతకు మించిన శిక్ష మరొకటి ఉండదు’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ స్పీచ్ సోషల్ మీడియా లో జనసేన పార్టీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.