Pawan Kalyan- Chandrababu: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. అవసరాలు, అధికారం కోసం విడిపోవడం, తిరిగి కలవడం సాధారణం. ప్రస్తుత రాజకీయాల్లో ఇవి ఎక్కువయ్యాయి. నేడు రేపు విడిపోతున్నాయి.. విడిపోయిన పార్టీలు కలుస్తున్నాయి.. విడిపోయి ఎన్ని భూతులు తిట్టుకున్నా కలిసిన తర్వాత స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. ఏ దోస్త్‌మే.. హమ్‌నహీ చోడేంగే అని నేతలు పాడుకుంటున్నారు. అయితే.. ఇలాగే ఇప్పుడు ఏపీలో రెండు వైరి పార్టీల మధ్య స్నేహం చిగురిస్తోంది. ఇందుకు అధికార వైసీపీ పరోక్షంగా సహకరిస్తోంది. అధికార పార్టీ శత్రువర్గాలను కలపడం ఏంటి అన్నప్రశ్న తలెత్తుతోంది. కానీ జగన్ సర్కార్ కక్షసాధింపు చర్యలతో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న ఫార్ములా ఇక్కడ అప్లయ్ అవుతోంది. పాలకుల వ్యతిరేక పార్టీలు ఏకమవుతున్నాయి. ఈ స్నేహానికి పరోక్షంగా అధికార పార్టీనే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అలా వాళ్లు గద్దరయ్యారు..
గత ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను కలిసి పోటీ చేద్దాం రండి అని స్వయంగా పిలిచారు. కానీ పవన్ తన బలమేంటో తేల్చుకుంటానని.. ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన టీడీపీ వైపు రాలేదు. కమ్యూనిస్టులు, బీఎస్పీతో తనకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని.. వారిని వదిలేసి.. ఎన్నికలు లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. దీంతో ఆయనకు అసలు టీడీపీతో కలసి నడవాలనే ఆలోచనే లేదని తేలిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. పవన్ కల్యాణ్ ఆలోచనల్లో మార్పు రావడానికి ప్రధాన కారణం జగన్‌రెడ్డి. అధికారం ఉందనే అహంకారంతో వేధింపులకు పాల్పడటం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్న అభిప్రాయానికి రావడంతో ఇక ఈ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్న నిర్ణయానికి వచ్చారు.

ఆంక్షల మధ్య ఏపీ ప్రజలు..
ప్రస్తుతం ఏపీలో ప్రజలు ఆంక్షల మధ్య బతుకుతున్నారు. కేసులన్నీ రాజకీయ పరమైనవే. చివరికి పవన్ కల్యాణ్‌ను కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ సినిమాలనూ దెబ్బతీసే ప్రయత్నం చేశారు. మొత్తం సినీ రంగాన్ని టార్గెట్ చేశారు. అదే సమయంలో సినీ ఇండస్ట్రీ చర్చల పేరుతో పిలిచి జగన్∙చిరంజీవితో దండం పెట్టించుకోవడం.. దారుణంగా వ్యహరించడం.. ఆ వీడియోలను లీక్ చేయించుకోవడం.. వంటివి పవన్ కల్యాణ్ ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి. జగన్‌కు బుద్ధి చెప్పాలన్న నిర్ణయానికి వచ్చారు. అది జరగాలంటే ఓట్లు చీలకూడదనే నిర్ణయానికి వచ్చారు. అప్పటినుంచి
ఒకే మాట మీద ఉన్నారు. వ్యూహాత్మకంగా రాజకీయాలు చేసుకుంటూ వెళ్తున్నారు.
కారణం ఏదైనా ఇప్పుడు పవన్ – చంద్రబాబు కలిశారంటే.. ఆ క్రెడిట్ జగన్‌రెడ్డికి.. ఆయన పాలనా అహంకారానికి.. కక్ష సాధింపుల నైజానికి చెందుతుందని.. టీడీపీ, జనసేన వర్గాలంటున్నాయి.