
రాష్ట్రంలో జనసేన పరిస్థితి రాజకీయంగా ఎలాంటిదో అందరికీ తెలిసిందే. నిర్దిష్టమైన ఓటుబ్యాంకు ఉన్నా కూడా ప్రజలను మెప్పించడంలో పవన్ ఘోరంగా విఫలం అయ్యాడు అన్నది జగమెరిగిన సత్యం. అయితే జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా కూడా రాపాక అనూహ్యంగా గెలిచారు. ఇక జన సైనికులకు ఆ దెబ్బతో బోల్డంత ఆత్మవిశ్వాసం వచ్చింది. అసెంబ్లీలో అధికార పక్షానికి ఒక సీటు తోనే తమ సత్తా చూపిస్తాం అంటూ రెచ్చిపోయారు క్రమక్రమంగా వారికి షాకుల మీద షాకులు ఇస్తూ వైఎస్సార్సీపీకి రాపాక దగ్గర అయిపోయారు.
మొదటి నుండి రాపాక…. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదు అని పదే పదే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. నిజానికి రాపాక పై అధికార పార్టీ అడ్డగోలు కేసులతో వేధింపులకు పాల్పడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించారు. తానే స్వయంగా దిగాల్సి వస్తుందని హెచ్చరించగా అప్పుడు రాపాక దాని నుంది బయట పడ్డాడు.

ఆ తర్వాత రాపాక భయపడ్డాడో ఏమో కానీ అధికార పార్టీకి అడుగడుగునావత్తాసు పలుకుతూ కనిపించాడు. కానీ ఆయన ఎన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు బహిరంగంగా అతని పై విమర్శలు చేసింది లేదు. అధినేత మాట్లాడే వరకు శాంతంగా ఉండమని నాయకులు కూడా జన సైనికులని హెచ్చరిస్తూనే ఉన్నారు రాపాక ను ఇంకా వారి మనిషి గానే చూస్తున్నారు తప్ప వైసిపి కి మద్దతు ఇస్తున్నాడు అన్న ఉక్రోషం, ఆగ్రహం ఏ మాత్రం లేకపోవడం గమనార్హం
అయితే తాజాగా రాపాక కు సంబంధించిన ఒక వీడియో వెలుగుచూసింది. కొన్ని కారణాలతో వైసీపీ లో మంచి అవకాశం దక్కించుకోలేకపోయానని…. అందుకే జనసేనలో చేరానని…. జనసేన నుంచి గెలిచిన వెంటనే జగన్ ని కలిస్తే ‘కలిసి పనిచేద్దాం’ అని జగన్ చెప్పారని…. అప్పటి నుండి తను వైసీపీ నేతగా చెలానణీ అవుతున్నానని వీడియోలో చెప్పారు. రాపాక చెప్పింది నిజమైతే అతను చేస్తున్న పనికి ‘నమ్మకద్రోహం’ ‘వెన్నుపోటు’ అనే మాటలు చాలా చిన్నవి అని జనసైనికులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంకా ఇంత జరిగినా కూడా దీనికి పవన్ స్పందించేది అనుమానమే. అయితే బయట ట్రెండ్ అవుతున్న సామెత ఏమిటంటే “పులికి గా తోకగా ఉండడం కన్నా పిల్లికి తలగా ఉండడమే మనిషికి గౌరవం అట.”