Passport Rules: మనం ఇతర దేశానికి వెళ్లాలంటే ఆ దేశం ఇచ్చే పర్మీషన్ పత్రం అంటే వీసా కావాల్సిందే. ఈ వీసా కావాలంటే దానికంటే ముందు మన దేశం ఇచ్చే పాస్ పోర్టు తీసుకోవాల్సిందే. పాస్ పోర్టు లేకపోతే వేరే దేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించదు. అయితే పాస్ పోర్టు నిబంధనల్లో కేంద్రప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. ఇక పై పాస్ పోర్టు కోసం అప్లై చేసే అన్ని పత్రాలతో పాటు మరో పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. 2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత పుట్టిన వారు తప్పనిసరిగా తమ బర్త్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. జనన, మరణాల ధ్రువీకరణకు రిజిస్ట్రార్, మున్సిపాల్ కార్పొరేషన్ లేదా సంబంధిత అధికారి జారీ చేసిన సర్టిఫికెట్ సబ్మిట్ చేయవచ్చని పేర్కొంది. అయితే 2023 అక్టోబర్ 1 కి ముందు పుట్టిన వారు డ్రైవింగ్ లైసెన్స్, టీసీ లేదా సంబంధిత అధికారి ద్వారా జారీ అయిన సర్టిఫికెట్ సమర్పించాలని తెలిపింది.
Also Read : పాస్పోర్ట్లోని పేజీని చింపివేస్తే మీ ట్రావెల్ హిస్టరీ తొలగిపోతుందా.. ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది ?
2023 అక్టోబర్ 1 నుండి పుట్టిన వారి పాస్ పోర్ట్ అప్లికేషన్లకు జనన మరణాల రిజిస్ట్రార్, మునిసిపల్ కార్పొరేషన్ లేదా మరేదైనా అధికారి జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ లను మాత్రమే పుట్టిన తేదీ రుజువుగా గుర్తించేందుకు ప్రభుత్వం 1980 పాస్పోర్ట్ నిబంధనలను మార్చింది. 1967 పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 24లోని రూల్స్ ప్రకారం పాస్పోర్ట్ నియమాలను సవరణ చేసినట్లు ఫిబ్రవరి 24న విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.
అధికారిక నోటిఫికేషన్ లో ప్రచురించబడిన తేదీన అమల్లోకి వచ్చే 2025 పాస్పోర్ట్ నియమాల ప్రకారం, అక్టోబర్ 1, 2023న లేదా ఆ తర్వాత పుట్టిన వారికి.. జనన మరణాల రిజిస్ట్రార్ లేదా మున్సిపల్ కార్పొరేషన్, లేదా 1969 జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం అధికారం పొందిన ఇతర అధికారి జారీ చేసిన..బర్త్ సర్టిఫికేట్లు మాత్రమే పుట్టిన తేదీకి ప్రూఫ్ లుగా ఉపయోగపడతాయి. అయితే, సవరణ తర్వాత, అక్టోబర్ 1, 2023 కి ముందు పుట్టిన వారు జనన తేదీకి రుజువుగా ఇతర పత్రాలను ఉపయోగించుకోవచ్చు.
ఈ పత్రాల్లో గుర్తింపు పొందిన పాఠశాలలు లేదా గుర్తింపు పొందిన విద్యా బోర్డులు జారీ చేసిన ట్రాన్స్ ఫర్ లేదా డ్రాపవుట్ లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్లు, అప్లికేషన్ పెట్టుకునే సదరు వ్యక్తి పుట్టిన తేదీతో; ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ కార్డు; ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డు లేదా రిటైర్మెంట్ అయితే ప్రభుత్వ ఉద్యోగుల పే పెన్షన్ ఆర్డర్ కాపీ, రాష్ట్ర రవాణా శాఖ మంజూరు చేసిన డ్రైవింగ్ లైసెన్స్; భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఓటర్ ఐడీ కార్డు; లేదా ఇన్సురెన్స్ కంపెనీలు లేదా ప్రభుత్వ సంస్థలు ఇచ్చే పాలసీ బాండ్ ఉన్నాయి.
వీటిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పాస్పోర్ట్ అప్లికేషన్లకు బర్త్ సర్టిఫికెట్లు కలిగి ఉండకపోవడం కామన్ కాబట్టి అందుకు రుజువుకు సంబంధించిన పాస్పోర్ట్ నిబంధనలను చాలా కాలంగా సవరించలేదని కొంతమంది తెలిపారు. అయితే, 1969 పుట్టిన, మరణ నమోదు చట్టాన్ని అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవడంతో బర్త్ సర్టిఫికెట్లను జనన తేదీకి ఏకైక రుజువుగా మార్చడానికి చర్యలు తీసుకున్నట్లు సదరు అధికారులు తెలిపారు.
Also Read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాస్పోర్ట్ ఏదో తెలుసా ? భారత్ ది ఇంత తక్కువనా ?