Rakul Preet Singh: ఒకప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. మీడియం రేంజ్ హీరోల నుండి, స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు తమ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకునేవాళ్ళు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, కోలీవుడ్ లో కూడా ఆమెకు అదే స్థాయిలో అవకాశాలు వచ్చాయి. కానీ మధ్యలో ఏమైందో ఏమో తెలియదు కానీ, రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్ మారిపోయాయి. మొదటి నుండి సన్నగా,నాజూగ్గా ఉండే రకుల్ ప్రీత్, జిమ్ లో వర్కౌట్స్ విపరీతంగా చేసి ఇంకా చిక్కిపోయింది. దీంతో ముఖం లో గ్లామర్ పోయింది. దానికి తోడు సౌత్ లో ఆమె చేసిన లేటెస్ట్ సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవ్వడంతో ఇక్కడి నుండి బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది.
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క విషయంలో తగ్గాల్సిందేనా..?అట్లీ, త్రివిక్రమ్ లలో ముందు ఎవరితో సినిమా చేస్తాడు..?
అక్కడ కూడా రకుల్ పరిస్థితి ఇంతే. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. మిగిలిన హీరోయిన్లు షారుఖ్ ఖాన్(Shahrukh Khan), సల్మాన్ ఖాన్(Salman Khan), హృతిక్ రోషన్(Hrithik Roshan) లాంటి హీరోలతో సినిమాలు చేస్తుంటే, రకుల్ ప్రీత్ మాత్రం అర్జున్ కపూర్ లాంటి మార్కెట్ లేని హీరోలతో సినిమాలు చేస్తుంది. రీసెంట్ గానే ఈమె అర్జున్ కపూర్ తో కలిసి చేసిన ‘మేరే హస్బెండ్ కి బివి’ చిత్రం థియేటర్స్ లో వచ్చిన సంగతి, వెళ్లిపోయిన సంగతి కూడా జనాలకు తెలియదు. ప్రెస్టీజియస్ సినిమాల్లో హీరోయిన్ రోల్స్ ఇక రకుల్ కి దక్కవు అని అనుకుంటున్న సమయంలో ఆమె ‘రేస్ 4′(Race 4 Movie) మూవీ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. రేస్ 1 , రేస్ 2 సినిమాల్లో హీరోగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. కానీ ‘రేస్ 3’ లో మాత్రం సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. ఈ చిత్రం కమర్షియల్ గా అనుకున్న రేంజ్ లో ఆడలేదు.
అయినప్పటికీ కూడా ఈ సిరీస్ ని ‘రేస్ 4’ తో కొనసాగిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ని ఎంచుకున్నారు. బాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన ఫ్రాంచైజ్ లో ఈమెకు హీరోయిన్ రోల్ రావడం అదృష్టమే. ఇందులో హీరోగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఈయనకి ఇప్పుడు మార్కెట్ లేదు. ఆయన హీరో రోల్స్ కి దూరమై కేవలం విలన్ రోల్స్ కి పరిమితం అయ్యాడు. కానీ క్రేజీ ఫ్రాంచైజ్ నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రానికి షూటింగ్ ప్రారంభం ముందే బాలీవుడ్ లో మంచి హైప్ ఉంది. ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యినట్టే. లేకపోతే మాత్రం కెరీర్ ని ముగించుకోవాల్సిందే, ఇక హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు రావడం కష్టం అని అంటున్నారు విశ్లేషకులు.
Also Read: ఈ ముగ్గురు దర్శకులను నట్టేట ముంచేసిన పవన్ కళ్యాణ్…