Homeబిజినెస్Honor Magic 8 Pro: హానర్ నుంచి ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త మొబైల్..

Honor Magic 8 Pro: హానర్ నుంచి ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త మొబైల్..

Honor Magic 8 Pro: ప్రస్తుత కాలంలో చాలా అవసరాలకు మొబైల్ ప్రధానంగా మారిపోయింది. దీంతో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను కలిగి ఉంటున్నారు. వినియోగదారుల అవసరాలను, అభిరుచులను దృష్టిలో ఉంచుకొని కొత్త కొత్త మొబైల్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. వీటిలో భాగంగా Honor కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునే మొబైల్స్ చాలా వరకు అందుబాటులో ఉంచింది.. అయితే కొత్తగా ఇప్పుడు ఫ్లాగ్ ఫిష్ స్మార్ట్ ఫోన్ ను ఇటీవల లాంచ్ చేసింది. ఈ మొబైల్ కెమెరా […]

Honor Magic 8 Pro: ప్రస్తుత కాలంలో చాలా అవసరాలకు మొబైల్ ప్రధానంగా మారిపోయింది. దీంతో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ను కలిగి ఉంటున్నారు. వినియోగదారుల అవసరాలను, అభిరుచులను దృష్టిలో ఉంచుకొని కొత్త కొత్త మొబైల్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. వీటిలో భాగంగా Honor కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునే మొబైల్స్ చాలా వరకు అందుబాటులో ఉంచింది.. అయితే కొత్తగా ఇప్పుడు ఫ్లాగ్ ఫిష్ స్మార్ట్ ఫోన్ ను ఇటీవల లాంచ్ చేసింది. ఈ మొబైల్ కెమెరా అద్భుతం అని చెప్పాలి. ప్రస్తుతం చాలామంది కెమెరా ప్రధానంగా ఉండే మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ కంపెనీలో మెగా పిక్సెల్ అధికంగా ఉన్న కెమెరా ఉన్న ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. వీటితోపాటు డిస్ప్లే, బ్యాటరీ పనితీరు కూడా మెరుగ్గా ఉందని తెలుస్తుంది. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాలు లోకి వెళ్తే..

HONOR కంపెనీ నుంచి లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన Magic 8 Pro గురించి ఆసక్తిగా చర్చ సాగుతోంది. ముందుగా ఈ మొబైల్ డిజైన్ గురించి చెప్తే దీనిని నానో క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ తో తయారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎటువంటి దుమ్ము, ధూళి లేకుండా ఇది కాపాడుతుంది. అలాగే ఇందులో ఉండే డిస్ప్లే అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోనుంది. ఈ మొబైల్లో 6.71 అంగుళాల LTPO OLED డిస్ప్లేను అమర్చారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పని చేస్తుంది. గరిష్టంగా 6000 nits బ్రైట్నెస్ తో పనిచేస్తుంది. ఈ మొబైల్లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ తో పని చేస్తుంది. గేమింగ్ కోరుకునే వారికి ఇది వేగవంతంగా ఉంటుంది. అలాగే ఇందులో 12gb రామ్, 512 GB స్టోరేజ్ ఉండడంతో కావాల్సిన స్పీడ్ ఉండనుంది.

ఈ మొబైల్లో కెమెరా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ డివైస్ లో మొత్తం 200 MP అల్ట్రా వైడ్ కెమెరాతో అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించనుంది. ఇందులో 50 MP మెయిన్ కెమెరాను అమర్చారు. 50 MP సెల్ఫీ కెమెరా పనిచేయనుంది.. ఈ మూడు కెమెరాలు ఏఐ ఫీచర్లతో పాటు 3D ఎఫెక్టెడ్ ఫోటోలను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ లో 6270 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ ఇవ్వనుంది. 80 W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ గా ఉండనివ్వండి. అలాగే ఈ మొబైల్లో ఆకట్టుకునే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఒకేసారి పలు రకాల యాప్స్ ఉపయోగించినా కూడా ఇలాంటి హ్యాంగింగ్ కాకుండా పనిచేస్తుంది. దీనిని యూకే మార్కెట్లో 1,099 పౌండ్లు గా ధర నిర్వహించారు. భారత్ లోకి వస్తే దీని ధర ఎలా ఉంటుందో చూడాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper