
పార్లమెంటు క్యాంటీన్‌లో ఎంపీలకు ఇచ్చే సబ్సీడిని తొలగించినట్టు స్పీకర్ ఓం బిర్లా గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. రాయితీలు ఎత్తివేయడంతో పార్లమెంట్ క్యాంటీన్‌లో ఆహార పదార్థాలు ధరలు పెరిగాయి. రాయితీ ఎత్తేసిన తర్వాత కొత్త ధరలతో మెనూను సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్‌సభ బిజినెస్ కమిటీలోని అన్ని పార్టీల సభ్యుల ఏకాభిప్రాయం మేరకు సబ్సిడీ తొలగింపుపై నిర్ణయం తీసుకున్నారు.
Also Read: మండిపోతున్న పెట్రోల్..: సెంచరీకి చేరువలో..
ఇప్పటివరకు ఈ క్యాంటీన్‌లో హైదరాబాదీ మటన్ బిర్యానీ 65 రూపాయలకు, బాయిల్డ్ వెజిటబుల్స్ 12 రూపాయలకు.. ఇలా అతి తక్కువ రేట్లకు అమ్ముతూ వచ్చారు. కానీ.. ఇకపై చాలా ఐటమ్స్ ని మార్కెట్ రేట్లకు అందివ్వనున్నారు. ఒక రోటీ 3 రూపాయలకు, శాకాహార భోజనం 100 రూపాయలు, నాన్ వెజ్ లంచ్ బఫె 700 రూపాయలకు లభ్యం కానునున్నాయి . మటన్ బిర్యానీ 150 రూపాయలైతే బ్రిటిష్ బాయిల్డ్ వెజిటబుల్స్ 50 రూపాయలకు దొరుకుతుంది.
Also Read: హింస ఎఫెక్ట్: చీలిపోయిన రైతు సంఘాలు
క్యాంటీన్‌లో ఆహారంపై ఇచ్చే రాయితీ గురించి రెండేళ్ల కిందట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో దీనిపై చర్చించారు. అన్ని పార్టీలూ ఒకే అభిప్రాయాన్ని చెప్పడం ద్వారా సబ్సిడీని రద్దు చేయడానికి అంగీకరించారు. తాజా నిర్ణయంతో క్యాంటీన్‌లో లభించే ఆహారం నిర్ణీత ధరకు లభిస్తుంది. ఎంపీలు ఇప్పుడు తాము తీసుకునే ఆహారానికి ధరలను మెనూ ప్రకారం చెల్లిస్తారు. పార్లమెంట్ క్యాంటీన్‌కు ఏటా సుమారు రూ.17 కోట్ల సబ్సిడీ కింద చెల్లిస్తున్నారు. సబ్సిడీని ఎత్తివేయడం వల్ల లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఏడాదికి రూ.8 కోట్లకుపైగా ఆదా అవుతుంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
పార్లమెంట్ క్యాంటీన్ ధరలు ఇప్పుడు అందిన సమాచారం మేరకు.. క్యాంటీన్ రేటు జాబితాలో చికెన్ కర్రీని రూ.50 లకు, వెజ్ థాలిని రూ.35 లకు అందిస్తారు. మూడు కోర్సుల భోజనం ధర రూ.106 లుగా నిర్ణయించబడింది. ఇక దక్షిణాది అల్పాహారం సాదా రూ.12లకు లభిస్తుంది. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నుంచే ఈ సబ్సిడీలను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా సబ్సిడీ ఎత్తివేయడం వల్ల సాలీనా రూ.8 కోట్లు ఆదా అవుతాయని లోక్ సభ సెక్రటేరియట్ అంచనా వేసింది. ఈ క్యాంటీన్ ని ఇకపై నార్తర్న్ రైల్వేస్ బదులు ఇండియా టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లేదా ఐటీడీసీ నిర్వహించనున్నాయి. ఇక్కడ సబ్సిడీతో కూడిన ఫుడ్ ఐటమ్స్ ని సప్లయ్ చేయడం వల్ల ఏడాదికి సుమారు 13 కోట్లు ఖర్చు అవుతుందట.