https://oktelugu.com/

బాహుబలి సినిమాలో కట్టప్ప ఎత్తుకున్న శిశు మహేంద్ర బాహుబలి ఎవరో తెలుసా?

తెలుగు సినిమాగా మొదలైన ‘బాహుబలి’ ఆ తర్వాత జాతీయ స్థాయి సినిమాగా ఆపై అంతర్జాతీయంగా తెలుగు సినీ ఇండస్ట్రీ పేరు మారు మోగేలా చేసింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ప్రభాస్, రానా, అనుష్క,రమ్యకృష్ణ,నాజర్, సత్యరాజ్, తమన్నాల నటన తోడై ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచిన ఈ మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. Also Read: ‘అనసూయ’ ఆస్తుల పై క్రేజీ రూమర్స్ ! అలాంటి సినిమాలో ఒక […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 28, 2021 / 04:42 PM IST
    Follow us on


    తెలుగు సినిమాగా మొదలైన ‘బాహుబలి’ ఆ తర్వాత జాతీయ స్థాయి సినిమాగా ఆపై అంతర్జాతీయంగా తెలుగు సినీ ఇండస్ట్రీ పేరు మారు మోగేలా చేసింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ప్రభాస్, రానా, అనుష్క,రమ్యకృష్ణ,నాజర్, సత్యరాజ్, తమన్నాల నటన తోడై ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచిన ఈ మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

    Also Read: ‘అనసూయ’ ఆస్తుల పై క్రేజీ రూమర్స్ !

    అలాంటి సినిమాలో ఒక సింగల్ షాట్ లో నటించిన నటులు కూడా వారి కెరీర్ మొత్తం బాహుబలి లో నటించాం అని గొప్పగా చెప్పుకుంటారు. ఈ మూవీలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ ఒక సీన్ లో అప్పుడే పుట్టిన మహేంద్ర బాహుబలిని చేతుల్లో ఉంచుకుని ఇతనే మీ మాహిష్మతి రాజ్యానికి వారసుడు అని ప్రకటిస్తాడు. నిజానికి ఆ బుజ్జి పసికందు అబ్బాయి కాదు అమ్మాయి. ఇప్పుడు అకస్మాత్తుగా ఆ పాప గురించిన న్యూస్ బయటకొచ్చింది.

    Also Read: సింగరేణిలో ప్రభాస్ యాక్షన్ !

    ఆ పాప పేరు ఏంటో తెలుసుకోవాలని ఉందా… ఆ బుజ్జి బాహుబలి అసలు పేరు తన్వి. ప్రస్తుతానికి కిండర్ గార్టెన్ స్టడీస్ చదువుతుందని సమాచారం. తన తండ్రితో ఉన్న ఫొటోలో బూరెల్లాంటి బుగ్గలతో చాలా బబ్లీగా కనిపిస్తుంది. కనీసం ఊహ కూడా రాని బుజ్జి పాపకి స్కూల్ లో ఇప్పటికే స్పెషల్ ఇమేజ్ ఉందట. ఊహ వచ్చిన తర్వాత బాహుబలి లాంటి గొప్ప సినిమాలో తాను కూడా భాగస్వామి అయ్యానని గర్వపడుతుందనుకోండి.పెద్దయ్యాక తన్వి డాక్టర్ అవుతుందో లేక యాక్టర్ అవుతుందో అని ఊహాగానాలతో ఉన్న అభిమానులకి కాలం మాత్రమే సమాధానం చెప్తుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్