Gujarat : కొందరికి ముక్క లేనిదే ముద్ద తిగదు. రోజూ వెజ్ కంటే నాన్ వెజ్ తింటేనే ఇష్టం. వెజ్‌తో తింటే వారికి అసలు తిన్న ఫీలింగ్ ఉండదు. అయితే ప్రస్తుతం రోజుల్లో చాలా మంది ఎక్కువగా.. నాన్ వెజ్ తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో కొందరు నాన్‌వెజ్‌కి దూరం అవుతున్నారు. వీటి కంటే ఆకు కూరలు, పండ్లు వంటివి మంచివని భావించి పూర్తిగా నాన్‌వెజ్ మానేస్తున్నారు. దేశంలో కూడా రోజురోజుకీ శాఖాహారం తినే వారి సంఖ్య పెరుగుతోంది. దేవుని మీద భక్తితో పాటు ఆరోగ్య విషయంలో ఆచరించే వారు నాన్‌వెజ్‌కి కాస్త దూరంగా ఉంటున్నారు. ఆలయాలు ఉన్న ప్రదేశాల్లో కాకుండా ప్రతీ ప్రదేశంలో తప్పకుండా మాంసం ఉంటుంది. కానీ మన దేశంలో ఈ నగరంలో మాత్రం అసలు మాంసం షాపులే ఉండదు. ఇక్కడ మంసం తినడం, విక్రయించడం చట్ట విరుద్ధం. ఇంతకీ ఆ నగరం ఏది? ఎందుకు మాంసాన్ని నిషేధించారు? పూర్తి వివరాలు కూడా మీకు తెలియాలంటే ఆర్టికల్ మొత్తం ఒకసారి చదివేయండి.
అందరికీ ఎంతగానే నచ్చే మాంసం గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో పాలిటానా నగరంలో నిషేధం. మాంసాన్ని నిషేధించిన మొదటి నగరం ప్రపంచంలో ఇదే. దీన్ని అధికారికంగా మాంసాన్ని నిషేధించారు. దీనికి ముఖ్య కారణం ఇక్కడ ముఖ్యమైన జైన పుణ్యక్షేత్రం ఉంటుంది. జైన సమాజం మతపరమైన సిద్ధాంతాల కోసం ఇక్కడ మాంసాన్ని నిషేధించారు. మూగ జీవుల పట్ల అహింసగా ఉండకుడదని అక్కడి ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నగరంలో దాదాపు 250 మాంసం దుకాణాలను మూసివేయాలని 200 మందికి పైగా జైన సన్యాసులు డిమాండ్ చేశారు. ఎన్నో నిరసనలు చేసిన తర్వాత ఇక్కడ మాంసం వినియోగం, తినడం అన్నింటిని కూడా పూర్తిగా నిషేదించారు. పాలిటానాలో ఆహారం కోసం జంతువులను చంపడం, మాంసం, గుడ్లు అమ్మకాలను నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. అహింసను ప్రేరేపించకూడదనే నియమం కూడా జైన తత్వ శాస్త్రంలో ఉంది. దీంతో అక్కడ మాంసాన్ని పూర్తిగా నిషేధించారు. అయితే ఈ నిషేధం అమలులోకి తెచ్చిన తర్వాత శాఖాహార రెస్టారెంట్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. జైనుల ప్రధాన యాత్ర స్థలాలలో పాలిటాన ఒకటి. ఇక్కడ శత్రుంజయ కొండ దేవాలయాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి యాత్రికులు వస్తుంటారు. నగర పవిత్రతను కాపాడేందుకు ఈ అహింసా విధానాన్ని తీసుకొచ్చారు.
ఇదిలా ఉండగా ప్రపంచంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వీటి ప్రదేశాల్లో మంసం అమ్మకాలు ఉండవు. కానీ కేవలం ఆలయం ఉన్న ప్రాంతంలో మాత్రమే అమ్మకాలు ఉండవు. నగరంలో మాత్రం ఉంటాయి. దీంతో అపచారం కలుగుతుందని పాలిటానా నగరంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్య విషయంలో మాంసాన్ని మానేస్తున్నారు. ఎక్కువగా వెజ్ ఐటమ్స్ తింటున్నారు.