Venice city : ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అందులో అత్యంత ధనిక దేశాలతో పాటు పేద దేశాలు కూడా ఉన్నాయి. కొన్ని దేశాల్లో కొత్త కొత్త ప్రాంతాలు కూడా ఉన్నాయి. చరిత్రను తెలిపే ప్రసిద్ధ కట్టడాలు అన్ని కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు విలాసవంతమైనవి కాకపోయినా కూడా కొన్ని వస్తువులు వాడుతుంటారు. దేశంలో ఉన్న వారందరూ కూడా రిచెస్ట్ కాకపోయినా.. కొందరు కొన్ని వస్తువులను వాడుతారు. అందులో కారు కూడా ఒకటి. కారు అనేది చాలా మంది కల. కారులో మొత్తం అన్ని చుట్టేయాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ ప్రపంచంలో ఓ రిచెస్ట్ సిటీలో (Richest City) మాత్రం అసలు కార్లు (Cars) లేవట. ఎంతో అందమైన నగరం. కానీ ఎక్కడ చూసినా కూడా ఒక్క కారు కూడా కనిపించదట. ఇంతకీ ఆ నగరం ఏది? ఎక్కడ ఉంది? దీని పూర్తి వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ప్రపంచంలోని రిచెస్ట్ సిటీస్‌లో వెనిస్ నగరం ఒకటి. ఈ ప్రదేశం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడి నిర్మాణ శైలి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కేవలం రిచెస్ట్ సిటీ మాత్రమే కాకుండా అందమైన నగరాల్లో కూడా వెనిస్ ఒకటి. ఇక్కడ మొత్తం118 ద్వీపాలు ఉన్నాయి. అలాగే ఇందులో 400 వంతెనలు ఉన్నాయి. కానీ ఈ దేశంలో అసలు కార్లు ఉండవు. ఈ దేశానికి వెళ్లిన వారు ఎక్కడైనా తిరగాలన్నా లోకల్ వాటర్ బస్సులు ఉంటాయి. కానీ కార్లు మాత్రం ఉండవు. ప్రతి సంవత్సరం ఇక్కడికి దాదాపుగా 20 మిలియన్ల మంది పర్యాటకులు వస్తుంటారు. అందరూ కూడా ఇక్కడ వాటర్ బస్సులోనే తిరుగుతారు. వెనిస్ నగరం పూర్తిగా నీళ్లతో ఉంటుంది. దీంతో కార్లకు ప్లేస్ లేకపోవడం వల్ల వాటర్ బస్సులను పెట్టారు. అక్కడ ఉండే స్థానికులు రోజూవారీ ప్రయాణం కోసం కాలువలను ఉపయోగిస్తారు. గొండోలాలు, వాపోరెట్టోలు లేదా వాటర్-బస్సులు మాత్రమే ఉంటాయి.
అందమైన నగరాల్లో వెనిస్ ఒకటి. ఇక్కడ ఉండే ద్వీపాలు ఎంతో అందంగా ఉంటుంది. వెనిస్ నగరంలో ఉన్న ద్వీపాలు అన్నింటిని కూడా చూడాలంటే ఏకైక మార్గం కూడా పడవనే. ఇక్కడ ఉన్న అందాలను చూడాలంటే వర్చువల్ టూర్ అనేవి ఉంటాయి. అక్కడి సిటీ కార్పొరేషన్ దీన్ని ప్రారంభించింది. అలాగే గొండోలాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిలో కేవలం 6 మంది మాత్రమే కూర్చోవడానికి అవుతుంది. అయితే ఇందులో డ్రైవర్‌గా చేయడం చాలా కష్టమట. వీటిని నడపడానికి ముగ్గురు లేదా నలుగురు గోండులకు మాత్రమే లైసెన్స్ ఇస్తున్నారు. ఈ పడవల రంగు కూడా కేవలం నల్లగా మాత్రమే ఉండాలి. అప్పుడే లైసెన్స్ ఇస్తారు. ఇక్కడి వీధులు కూడా చాలా ఇరుకుగా ఉంటాయి. ప్రపంచంలోని అతి చిన్న వీధి కూడా ఇక్కడే ఉంది.