Intelligent Country : ప్రపంచంలోని అన్ని దేశాలకి ప్రతీ దానికి కూడా భారత్ గట్టి పోటీని ఇస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతీ దాంట్లో భారత్ (India) సత్తా చాటుతోంది. అయితే ఈ ప్రపంచంలో ఎందరో తెలివైన వారు ఉన్నారు. అలాగే ఎంతో ఉన్నతమైన విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రపంచంలో (World) కొన్ని దేశాలు తెలివైనవి (Intelligent) కూడా ఉన్నాయి. వీటిని లెక్కించడం కూడా కష్టమే. విద్యపై భారీగా పెట్టుబడులు పెట్టడం లేదా ఉన్నత ప్రమాణాలను స్థిరంగా నిర్వహించే వాటిని తెలివైన దేశాలుగా పరిగణిస్తారు. విద్యకు విలువ నిస్తూ.. స్వీయ అభివృద్ధి సంస్కృతిని పెంపొందించే దేశాలు ఎప్పుడు ఉన్నతంగా ఉంటాయి. అయితే ఇటీవల వరల్డ్ ఆఫ్ కార్డ్ గేమ్స్ అత్యంత తెలివైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోని అత్యంత తెలివైన దేశం ఏది? ఇందులో ఏయే దేశాలు ఉన్నాయి? భారత్ స్థానం ఏంటో? తెలియాలంటే స్టోరీ మొత్తం ఆలస్యం చేయకుండా చదివేయండి.
ఈ ప్రపంచంలో అత్యంత తెలివైన దేశం స్విట్జర్లాండ్. విద్య విషయంలో దీని ర్యాంకింగ్ 100కి 92.02 స్కోర్ పొందింది. ఇది అత్యంత ధనిక దేశాల్లో ఒకటి. అలాగే ఈ దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశంలో 1,099 మంది నోబెల్ ప్రైజ్ నామినేషన్లు పొందారు. అలాగే సగటు వీరి IQ 99.24గా ఉంది. అయితే విద్య పరంగా 40.02% మంది కనీసం బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉన్నారు. 18.05% మంది మాస్టర్స్ డిగ్రీ అర్హత కలిగి ఉన్నారు. స్విట్జర్లాండ్‌లో దాదాపుగా 32 విశ్వవిద్యాలయాలు నోబెల్ బహుమతి ప్రతిపాదనలు కూడా అందుకున్నాయి. అయితే రెండవ స్థానంలో యూకే 89.40 స్కోర్‌తో ఉంది. 89.18 స్కోర్‌తో యూఎస్ మూడవ స్థానంలో ఉంది.
ప్రపంచంలోని తెలివైన దేశాల్లో భారత్ 138వ స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజల IQ స్కోర్ 76.24గా ఉంది. అంటే మన దేశం ఎంత వెనుక బడిందో అర్థం చేసుకోవచ్చు. భారత్ ఎన్నో ప్రయోగాలు చేస్తుంది. ఎన్నో కొత్త ఆవిష్కరణలు కూడా తీసుకొస్తుంది. కానీ ప్రపంచంలోని తెలివైన దేశాల్లో ఇది ఎప్పటికీ వెనుకగానే ఉంటోంది. దీనికి ముఖ్య కారణం మన దేశంలో చాలా మంది చదువు లేకుండా ఉంటున్నారు. కనీస డిగ్రీ కూడా పూర్తి చేయడం లేదు. ఆర్థిక సమస్యలు, ఇంట్లో ఇబ్బందులు ఇలా కొన్ని కారణాల వల్ల చాలా మంది చదవడం లేదు. ఒకవేళ ప్రారంభించినా కూడా దాన్ని పూర్తి చేయడం లేదు. మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇలాంటి కారణాల వల్లే మన దేశం ఇంకా వెనుక బడుతోంది. ఇకనైనా అందరూ కూడా కనీస డిగ్రీను పూర్తి చేయడం వల్ల ఈ ర్యాంకింగ్ మారవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.