Homeఅంతర్జాతీయంPakistan-China: పాకిస్తాన్-చైనాకు చెడింది ఇలా.. ఆ ఒక్కటి దూరం చేసిందా?

Pakistan-China: పాకిస్తాన్-చైనాకు చెడింది ఇలా.. ఆ ఒక్కటి దూరం చేసిందా?

Pakistan-China: చైనా, పాకిస్తాన్‌ల బంధం చూసి కొందరు వీరిని ఐరన్ బ్రదర్స్ అని పిలుస్తున్నారు. కాగా, వీరు ఇలా ఫ్రెండ్స్ కావడానికి ఇండియానే కారణం. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సూత్రం ప్రకారం చైనా, పాకిస్తాన్ ల ఉమ్మడి శత్రువు ఇండియా. కాగా, అలా వీరిరువురు భారత దేశానికి వ్యతిరేకంగా కార్యచరణ అమలుకు పూనుకున్నారు. అలా ఇండియాను ఇబ్బంది పెట్టేందుకుగాను ఇరు దేశాలు ప్లాన్ చేసుకున్నాయి. కాగా, ప్రస్తుతం పాకిస్తాన్, చైనా దేశాల మధ్య కూడా చెడింది. ఎందుకంటే..

Pakistan-China
Pakistan-China

పక్కలో బల్లెంలాగా ఉన్న ఇండియా బోర్డర్ లో ఉన్న పాకిస్తాన్, చైనా ఇండియాకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌ను దెబ్బతీసేందుకుగాను అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు అండగా నిలిచింది చైనా. అటువంటి బంధానికి ఇప్పుడు బీటలు పడే పరిస్థితులు కనబడుతున్నాయి. స్నేహహస్తంలో భాగంగా చైనా..పాకిస్తాన్‌లో హైడ్రో పవర్ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టింది. కాగా, అక్కడ గతేడాది జూలై 14న ఉగ్రదాడి జరిగింది. ఆ దాడిలో 36 మంది చైనా కార్మికులు చనిపోయారు.

Also Read: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

ఈ నేపథ్యంలో చైనా కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని చైనా డిమాండ్ చేసింది. 38 మిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాల్సిందేనని కండీషన్ పాక్ ముందర చైనా ఉంచింది. అనగా ఇండియన్ కరెన్సీలో రూ.282 కోట్లు. ఒక్కో ప్రాణానికి రూ.2.3 కోట్లు. అదే ఇప్పుడు పాకిస్తాన్ ను ఇరకాటంలో పెట్టింది. ఇప్పటికే ప్రభుత్వ నిర్వహణకు విదేశీ నిల్వలు లేక పాకిస్తాన్ ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఇప్పుడు నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్ పాక్ ను మరింత కష్టాల్లోకి నెట్టినట్లయింది. పరిహారం చెల్లించేందుకుగాను పాకిస్తాన్ మొండికేసింది.

దాంతో చైనా హైడ్రో పవర్ డ్యామ్ పనులను అర్ధాంతరంగా నిలిపేసింది. అలా చైనా, పాకిస్తాన్ మధ్య స్నేహంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా చైనా, పాకిస్తాన్ మధ్య బంధం బీటలు వారే స్థితికి వచ్చిందని అంటోంది. ఇకపోతే చైనా తమతో స్నేహంగానే ఉందని భావించినప్పటికీ పరిహారం అడగడం ఊహించలేదన్నట్లుగా పాకిస్తాన్ చెప్తోంది. చైనా వైఖరి కూడా అలానే ఉంది. ఫ్రెండ్ షిప్‌లో ఉన్నప్పటికీ తమ దేశ కార్మికులకు నష్టం జరిగితే ఊరుకునేదే లేదు అని తేల్చి చెప్పేస్తోంది.

Also Read:  ట్రైలర్ తో ‘సఖి’ అదరగొట్టింది.. ఓపెనింగ్స్ వస్తాయి !

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version