https://oktelugu.com/

Trendy Rumors: ఈ ట్రెండీ రూమర్స్ నిజమైతే ఫ్యాన్స్ కు పండగే !

Trendy Rumors: సమంత, విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ మూవీలో స్పెషల్ సాంగ్ చేయబోతుందని.. ఈ సాంగ్ కోసం ఆమెను ఇప్పటికే సంప్రదించినట్లు రూమర్స్ బాగా వినిపించాయి. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీలోని స్పెషల్‌ సాంగ్‌ కి చాలా ఇంపార్టెన్స్ ఉందట. అందుకే, ఆ పాట కోసం సమంతను ఎంచుకోవాలని పూరీ జగన్నాథ్‌ భావిస్తున్నాడని తెలుస్తోంది. మరి లైగర్‌ లో సమంత ఐటెం సాంగ్ అనేది నిజం అయితే, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పండగే. […]

Written By: , Updated On : January 24, 2022 / 10:48 AM IST
Follow us on

Trendy Rumors: సమంత, విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ మూవీలో స్పెషల్ సాంగ్ చేయబోతుందని.. ఈ సాంగ్ కోసం ఆమెను ఇప్పటికే సంప్రదించినట్లు రూమర్స్ బాగా వినిపించాయి. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీలోని స్పెషల్‌ సాంగ్‌ కి చాలా ఇంపార్టెన్స్ ఉందట. అందుకే, ఆ పాట కోసం సమంతను ఎంచుకోవాలని పూరీ జగన్నాథ్‌ భావిస్తున్నాడని తెలుస్తోంది. మరి లైగర్‌ లో సమంత ఐటెం సాంగ్ అనేది నిజం అయితే, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పండగే.

Samantha

Samantha

ఇక మరో రూమర్ విషయానికి వస్తే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో డైరెక్టర్ మారుతి ఓ హార్రర్ కామెడీ తెరకెక్కించబోతున్నారని ఇటీవల జోరుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ మూవీకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ వార్తలపై డైరెక్టర్ మారుతి స్పందిస్తూ.. ‘సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. అప్పటి వరకూ వేచి ఉండండి’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేగాని ప్రభాస్ తో సినిమా చేయడం లేదు అని మాత్రం చెప్పలేదు. మరి ఇది నిజం అయితే, షాకింగ్ విషయమే.

Also Read: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Chiranjeevi, Prabhas and Maruthi

Prabhas Maruthi

ఇక డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కలిసి తాను ఇటీవల భీమ్లానాయక్ రఫ్ పుటేజీని చూశానని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో పవన్‌కల్యాణ్ యాక్షన్ తనకు ఎంతో నచ్చిందని, ఆయన కెరీర్‌లోనే ఉత్తమ చిత్రం అవుతుందని తెలిపాడు. ఈ సినిమా కోసం బెస్ట్ మ్యూజిక్ అందించడానికి ప్రయత్నించానన్నాడు. మరి థమన్ చెప్పింది నిజమైతే పవన్ ఫ్యాన్స్ కు ఇంతకీ మించిన పండగ ఏమి ఉండదు.

Also Read:: ట్రైలర్ తో ‘సఖి’ అదరగొట్టింది.. ఓపెనింగ్స్ వస్తాయి !

Tags