Team India: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలంటారు. దక్షిణాఫ్రికాలో టీమిండియా ఓటమికి పలు కారణాలు ఉన్నాయి. టీమిండియా ఇటీవల పరాజయాల బాట పట్టింది. దీంతో విజయం దక్కడం లేదు. ఫలితంగా విదేశాల్లో ఎన్నో రికార్డులు సృష్టించిన భారత జట్టు ప్రస్తుతం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో అభిమానుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ కోల్పోయినా కనీసం వన్డే సిరీస్ అయినా గెలుచుకుని సత్తా చాటాలని భావించినా అది కూడా నెరవేరలేదు. దీంతో అప్రదిష్ట మూటగట్టుకుంది.
టీమిండియా ఓటమికా కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో మిడిలార్డర్ వైఫల్యం. నిష్ణాతులైన ఆటగాళ్లున్నా ఆటను అంచనా వేయడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా మ్యాచ్ చేజారిపోతోంది. విజయం అందడం లేదు. ఓపెనర్లు శుభారంభం చేసినా తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ సద్వినియోగం చేసుకోవడం లేదు. దీంతో ఆట మొదటికొస్తుంది. అపజయం వెక్కిరిస్తోంది. ఎన్ని మ్యాచుల్లో జరుగుతున్నా టీమిండియా గుణపాఠం నేర్వడం లేదు. దీంతో భారీ మూల్యమే చెల్లించుకుంటోంది.
Also Read: ఈ ట్రెండీ రూమర్స్ నిజమైతే ఫ్యాన్స్ కు పండగే !
బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా వెక్కిరిస్తోంది. పేలవమైన బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడం చేయడం లేదు. దీంతో భారీగా పరుగులు సమర్పించుకుని మొహాలు తెల్లబోతున్నారు. దీంతో విజయం దోబూచులాడుతోంది. భారత బౌలర్ల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలో టీమిండియాలో ఈ లోపాలు ప్రధానంగా కనిపించాయి. దీంతో విజయాల బాటలో టీమిండియా వెనుకబడిపోతోంది.
బాధ్యతారాహిత్యమైన బ్యాటింగ్ తో మనవాళ్లు అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో టెస్ట్ సిరీస్ కల చెదిరిపోగా వన్డే సిరీస్ కూడా అందకుండా పోయింది. ఆటగాళ్ల ప్రాతినిధ్యంపై విమర్శలు పెరిగాయి. టీమిండియా ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళుతుందనే అపవాదును మూటగట్టుకుంటోంది. రిషబ్ పంత్ బాధ్యతారాహిత్యమైన షాట్లు ఆడుతూ అడ్డంగా బుక్కవుతున్నాడు. దీనిపై ఎంత విమర్శలు వచ్చినా ఆయన వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు.
ఈ క్రమంలో టీమిండియాపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. విదేశాలకు వెళ్లి సిరీస్ గెలవకుండా సరదాగా గడిపుతున్నారని పోస్టులు పెడుతున్నారు. ఆటగాళ్ల మధ్య సమన్వయం కొరవడిందనే వదంతులు సైతం వ్యాపిస్తున్నాయి. ఏది ఏమైనా టీమిండియా మాత్రం ఈ పర్యటన అత్యంత పేలవంగా ముగించించిందని పలువురు నెటిజన్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ లో ఇలాగే ఉంటే టీమిండియాకు శస్ర్త చికిత్స అవసరమనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?