India vs Australia 2nd T20I: మనకు అనుకూలంగా లేని చోట అధికులం అని అనకూడదు. ఎందుకంటే దానివల్ల ఉన్న పరువు కాస్త పోతుంది. పైగా అనవసరంగా చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే పరిస్థితిని టీమిండియాలో గిల్ ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి గిల్ అద్భుతమైన ఆటగాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. పైగా అతడు స్థిరంగా ఇన్నింగ్స్ నిర్మించడంలో పేరుపొందాడు. అయితే అతని టెక్నిక్ టి20కి సరిపోవడం లేదు. బంతులను ఎదుర్కోవడంలో అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఫుట్ టెక్నిక్ కూడా సరిగా లేకపోవడంతో పరుగులు తీయడానికి అవస్థలు పడుతున్నాడు. మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన రెండవ టి20లో గిల్ ఆట తీరు చూస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది.
గిల్ ఇటీవల టీమిండియా టెస్ట్, వన్డే జట్లకు సారధి అయ్యాడు. టెస్ట్ ఫార్మాట్ లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్ లో శతకాల మోత మోగించాడు. స్వదేశంలో వెస్టిండీస్ జట్టుతో జరిగిన సిరీస్ లోనూ అదరగొట్టాడు. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా టీమిండియా కు కెప్టెన్ అయ్యాడు. అయితే తొలి సిరీస్ ను టీమిండియా కు అందించలేకపోయాడు. 3 వన్డేలలో కూడా అతడు విఫలమయ్యాడు. వన్డేలలో విఫలమైనప్పటికీ.. అతడికి టి20లో అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి.. విఫలమవుతున్నాడు. తొలి టీ20 లో దారుణంగా అవుట్ అయ్యాడు. కాకపోతే ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఇక రెండవ టి20 లో ఆకట్టుకోవాల్సిన గిల్ దారుణమైన ఆట తీరు ప్రదర్శించాడు.
ఓపెనర్ గా రంగంలోకి వచ్చిన అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. పది బంతులు ఎదుర్కొని.. ఐదు పరుగులు చేశాడు.. హేజిల్ వుడ్ బౌలింగ్ లో మిచెల్ మార్ష్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. గిల్ ఇలా విఫలం కావడంతో సోషల్ మీడియాలో అతనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టి20 ఫార్మాట్ గిల్ ఆడ లేడని.. అతడు కేవలం టెస్ట్, వన్డేలకు మాత్రమే పనికి వస్తాడని.. కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు. గిల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన సంజు శాంసన్(2), సూర్య కుమార్ యాదవ్ (1), తిలక్ వర్మ (0) దారుణంగా విఫలమయ్యారు. సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ హేజిల్ వుడ్ బౌలింగ్లో ఔట్ అయ్యారు. ఇద్దరినీ కూడా ఓకే తరహా బంతులతో హేజిల్ వుడ్ ఔట్ చేయడం విశేషం. ఈ కథనం రాసే సమయం వరకు టీమిండియా 5.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది. క్రీజ్ లో అభిషేక్ శర్మ (25), అక్షర్ పటేల్ (2) ఉన్నారు.
Josh Hazlewood first spells 3-0-6-3
Shubman Gill – 5(10)
SuryaKumar Yadav – 1(4)
Tilak Verma – 0(2)Josh Hazlewood pic.twitter.com/eOrtP3Jb3q
— VIKAS (@Vikas662005) October 31, 2025