https://oktelugu.com/

ఆక్సిజన్ కొరత: జర్మనీ సాయం కోరిన భారత్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండడం.. ఆక్సిజన్ కొరతతో వందలాది మంది ప్రాణాలు పోతుండడంతో కేంద్రంలోని బీజేపీ సర్కార్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఉన్నట్లు వచ్చిన నివేదికలతో ఈ కొరతను తీర్చడానికి భారతదేశం తాజాగా జర్మనీ సాయం కోరింది. జర్మనీ దేశం నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే యంత్రాలు.. కంటైనర్లను దిగుమతి చేసుకోనుంది. జర్మనీ నుండి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను విమానాల ద్వారా తీసుకువస్తున్నట్లు ప్రభుత్వ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2021 4:21 pm
    Follow us on

    దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండడం.. ఆక్సిజన్ కొరతతో వందలాది మంది ప్రాణాలు పోతుండడంతో కేంద్రంలోని బీజేపీ సర్కార్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఉన్నట్లు వచ్చిన నివేదికలతో ఈ కొరతను తీర్చడానికి భారతదేశం తాజాగా జర్మనీ సాయం కోరింది.

    జర్మనీ దేశం నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే యంత్రాలు.. కంటైనర్లను దిగుమతి చేసుకోనుంది. జర్మనీ నుండి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను విమానాల ద్వారా తీసుకువస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటిని కొరత ఉన్న ఆసుపత్రులలో మోహరించి, అవసరమైన వారికి తగిన ఆక్సిజన్‌ను అందిస్తామన్నారు.

    ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాల్లో తగినంత ఆక్సిజన్ సరఫరా కోసం భారత్ పెద్దసంఖ్యలో ఆక్సిజన్ కంటైనర్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కోవిడ్ -19 సెకండ్ వేవ్ తో భారతదేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండడంతో జర్మనీ స్పందించింది. ఈ మేరకు ఆక్సిజన్ తయారీ యంత్రాలు అందిస్తోంది. ఇక మిగతా స్నేహపూర్వక దేశాల నుంచి ఆక్సిజన్ కంటైనర్లు మరియు సామగ్రిని దిగుమతి చేసుకోవాలని భారత్ చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

    స్నేహపూర్వక దేశాల నుంచి ఆక్సిజన్ కంటైనర్లు.. పరికరాలను తీసుకురావడానికి భారత వైమానిక దళాన్ని ఉపయోగించుకోవాలని కేంద్రప్రభుత్వం ప్రణాళికలు చేసింది. పెద్ద కంపెనీలతో ఈ మేరకు చర్చలు జరుపుతోంది. రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఔషధాల కొరతను తీర్చేందుకు విదేశాల నుంచి వెంటనే వైమానిక దళం ద్వారా వాటిని తీసుకొస్తోంది. మహమ్మారిపై పోరాడటానికి ప్రభుత్వానికి సహాయపడటానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు.

    ఢిల్లీలోని కోవిడ్ కేంద్రాల కోసం బెంగళూరు నుండి డీఆర్డీవో నుంచి ఆక్సిజన్ కంటైనర్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో తరలించారు. మంగళవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్ని రక్షణ సంస్థలను కోవిడ్ -19 ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని, అత్యవసర అధికారాలను ఉపయోగించాలని.. సంక్షోభాన్ని పరిష్కరించడానికి రిటైర్డ్ సిబ్బందిని తీసుకురావాలని ఆదేశించారు.

    ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవటానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేయడానికి టీకాలు వేసిన రిటైర్డ్ మిలరీ సాయుధ దళాల సేవలను ఉపయోగించుకోవాలని కేంద్రరక్షణ మంత్రి రాజ్ నాథ్ రాష్ట్రాలకు సూచించారు.