మద్యం, మాంసం షాపులపై తనిఖీ!

కరోనా విజృంభన తొలి రోజుల్లో చికెన్ పై వచ్చిన వదంతులతో మాంసం డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఆ తర్వాత చిన్న చిన్నగా చికెన్ పై వచ్చిన వార్తలు అసత్యం అని తేలడంతో మాంసం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గతంలో కంటే మాంసం ధరలను అధిక మొత్తంలో పెంచి గతకాలపు నష్టాలను పూడ్చుకునే పనిలోపడ్డారు అమ్మకం దారులు. విషయం తెలుసుకున్న తూనికలు-కొలతలు శాఖ అధికారులు హైదరాబాద్ లోని అంబేర్పెట్ లో అధిక ధరలకు మాంసం అమ్మే షాపులపై గురువారం […]

Written By: Neelambaram, Updated On : April 24, 2020 10:18 am
Follow us on

కరోనా విజృంభన తొలి రోజుల్లో చికెన్ పై వచ్చిన వదంతులతో మాంసం డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఆ తర్వాత చిన్న చిన్నగా చికెన్ పై వచ్చిన వార్తలు అసత్యం అని తేలడంతో మాంసం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గతంలో కంటే మాంసం ధరలను అధిక మొత్తంలో పెంచి గతకాలపు నష్టాలను పూడ్చుకునే పనిలోపడ్డారు అమ్మకం దారులు. విషయం తెలుసుకున్న తూనికలు-కొలతలు శాఖ అధికారులు హైదరాబాద్ లోని అంబేర్పెట్ లో అధిక ధరలకు మాంసం అమ్మే షాపులపై గురువారం తనిఖీ నిర్వహించారు. అంబేర్పెట్ లోని కొన్ని మాంసం షాపుల్లో అధిక ధరలకు మాంసం అమ్ముతున్నారని స్థానిక ప్రజల సమాచారం మేరకు అకస్మాత్తుగా తనిఖీ చేశారు.దీనితో అధికారులు అధిక ధరలకు అమ్మే షాపులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొందరు ఇలా ఎక్కువ ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

అదే విధంగా లాక్ డౌన్ కారణంగా మద్యం విక్రయాలు బాగా తగ్గిపోయాయి. దీనిని కూడా కొంతమంది అమ్మకం దారులు క్యాష్ చేసుకుంటున్నారు. రహస్య ప్రాంతాలలో బెల్ట్ షాపులు, కల్లు దుకాణాలు పెట్టి యధేచ్చగా మందు, కల్లును విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న మేడ్చల్ ఎక్సైజ్ పి.యస్ పరిధి ఎక్సైజ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ సహకారంలో‌ పలు బెల్ట్ షాపులు, కల్లు దుకాణాల పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మేడ్చల్ మండల్ ఘనపూర్ తాండాలోని భూక్య మిటీయా నాయక్ నుండి 72 విస్కీ బాటిళ్లు, ఇస్లావత్ వెంకటేశ్ వద్ద నుండి 76 విస్కీ బాటిల్స్ మరియు సైదోని గడ్డ తండాలో ఉంటున్న బాణావత్ సురేష్ వద్ద నుండి 30 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించడంతో వారిపై కేసు నమోదు చేశారు.