NPCI
NPCI : నేటి కాలంలో ఫోన్ పే, గూగుల్ పే వాడని వారు లేరని చెప్పవచ్చు. ఎందుకంటే కిరాణం షాపు నుంచి పెద్దపెద్ద షాపింగ్ చేసేవారు మనీ ట్రాన్సాక్షన్ కోసం మొబైల్ ద్వారా ఈ యాప్ లను ఉపయోగిస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చాలా ఈజీ కావడంతో అందరూ దీనినే ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా ఈ ట్రాన్సాక్షన్ కోసం ఎలాంటి డబ్బులు వసూలు చేయకపోవడంతో దీనికి కనెక్ట్ అవుతున్నారు. అయితే ఒక్కోసారి వీటి వాడకంలో కూడా కాస్త నిర్లక్ష్యంగా ఉంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు అవగాహన లేకుండా ఫోన్ నెంబర్ మిస్ అయితే వేరే వాళ్లకు డబ్బులు వెళుతున్నాయి. మరికొందరు అనుకోకుండానే డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అయితే కొందరు సైబర్ నేరగాళ్లు మొబైల్ నెంబర్లను ఉపయోగించి తమకు తెలియకుండానే ఖాతాదారుల నుంచి ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఈ విషయంలో తాజాగా NPCI కీలక ఆదేశాలను ఇచ్చింది. అదేంటంటే?
Also Read : బీటెక్ విద్యార్థులకు శుభవార్త.. ప్రముఖ సంస్థలో భారీ వేతనంతో జాబ్స్!
మొబైల్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ మొత్తం National payment corporation of India (npci) ద్వారానే జరుగుతుంది. అయితే ఈ సంస్థ తాజాగా కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటివరకు వాడని మొబైల్ నెంబర్లు, డి ఆక్టివేట్ అయిన నెంబర్లు తొలగించాలని పేర్కొంది. వీటి స్థానంలో అవే నెంబర్లు తీసుకుంటే.. వాటిని అప్డేట్ చేయాలని తెలిపింది. ఈ ప్రాసెస్ మొత్తం మార్చి 31 లోగా పూర్తి చేయాలని వివరించింది.
అయితే చాలామంది ఇప్పటివరకు మొబైల్ నెంబర్లు తీసుకొని వాటిని వాడకుండా వదిలేస్తున్నారు. మరికొందరు డి ఆక్టివేట్ చేసుకున్నారు. అయితే ఈ నెంబర్లపై గతంలో బ్యాంక్ అకౌంట్ లింకై వాటి ద్వారా మనీ ట్రాన్స్ఫర్స్ చేసినట్లయితే.. ఆ నెంబర్లు డిఆక్టివేట్ చేసిన.. లేదా వాడకుండా వదిలేసిన.. వాటిని కొందరు సైబర్ నేరగాళ్లు ఆక్టివ్ చేసుకొని వాటి ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీంతో ఖాతాదారులకు తెలియకుండానే డబ్బులు మాయమవుతున్నాయి. అయితే తమ పాత నెంబర్ల ద్వారానే డబ్బులు మాయమైనట్లు కొందరు గుర్తించారు. నేనే పద్యంలో ఫిర్యాదులు అందుకున్న NPCI తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. టెలికం ఆపరేటర్లు వెంటనే పాత నెంబర్లను తొలగించి వాటి స్థానంలో కొత్త నెంబర్లను చేర్చాలని.. లేదా ఆ నెంబర్లు ఉపయోగిస్తే వెంటనే వాటిని అప్డేట్ చేసి ఆ వివరాలను చెప్పాలని తెలిపింది.
అయితే వినియోగదారులు సైతం పాత నెంబర్లు లేదా ఉపయోగించనీ నెంబర్లు ఉంటే వాటిని వెంటనే డి ఆక్టివేట్ చేసుకోవాలని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇలా ఈ నెంబర్లపై కొందరు ఇతరుల కు ఫోన్లు చేసి అక్రమమైన పనులకు ఉపయోగిస్తున్నారు. దీంతో వినియోగదారులు తప్పు చేయకపోయినా శిక్షలు అనుభవిస్తున్నారు. అందువల్ల ఇప్పటికైనా ఏదైనా నెంబర్ ఉపయోగించినట్లయితే వాటిని వెంటనే డిఆక్టివేట్ చేసుకోవాలని తెలుపుతున్నారు. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అయితే సాధ్యమైనంతవరకు అవసరం మేరకే సిమ్ కార్డులు తీసుకోవాలని.. అవసరం లేకుండా ఎక్కువగా సిమ్ కార్డులు తీసుకోవద్దని తెలుపుతున్నారు.
Also Read : యూపీఐ కొత్త రూల్.. ఈ రోజు నుంచి ఈ పేమెంట్స్ చేయలేరు..