UPI Rules Change: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేజ్(UPI) అనేది ఇండియాకు చెందిన ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టం. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCi) 2016 లో అభివృద్ధి చేసింది. దీంనిద్వారా ఒక వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి మరో వ్యక్తి బ్యాంకు అకౌంట్‌కు డబ్బులను పంపిచండం సులభం అయింది. టీ తాగితే రూ.10, కరగాయలు కొంటే రూ.50, నిత్యవసారలు కొంటే రూ.1000, ఆభణాలు కొంటే రూ.లక్ష ఇలా ప్రతీది యూపీఐ ద్వారానే జరుగుతోంది. పేమెంట్స్ చేసే వారికి ట్రాన్‌జాక్షన్ ఐడీ గురించి తెలిసే ఉంటుంది. కొన్ని చోట్ల పేమెంట్ చేసిన సమయంలో ఐడీ చెప్పమని అడుగుతుంటారు. ప్రతీ ట్రాన్‌జాక్షన్‌కు ఈ ఐడీ ఆటోమేటిక్‌గా తయారవుతుంది. ఈ ఐడీలు ఆల్ఫా న్యూమరిక్ అంటే.. అంకెలు, అక్షరలు మాత్రమే ఉండేలా జనరేట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో స్పెషల్ క్యారెక్టర్లు కూడా జనరేట్ అవుతాయి. అయితే ఇప్పడు ఇలాంటి యూపీఐ ట్రాన్‌జాక్షన్ ఐడీ(Alfa Numaric ID)లకు సంబందించి కొత్త రూల్ తీసుకొచ్చింది. ఎన్‌పీసీఐ. ఇకపై ట్రాన్‌జాక్షన్ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే దానిని అనుమతించదు. యూపీఐ ట్రాన్‌జాక్షన్ ఐడీలను యూపీఐ సెంట్రల్ సిస్టమ్ అనుమతించదని స్పష్టం చేసింది ఎన్‌పీసీఐ. 2025, ఫిబ్రవరి 1 నుంచి దీనిని అమలులోకి తెచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటికే యూపీఐ వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న అన్ని డిజిట్ పేమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలకు తెలిపింది. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, కెడ్; ఫ్రీ చార్జ్, నవీ, వన్ కార్డ్, బజాప్ ఫన్ సర్వ్, ధని, బిగ్ క్యాష్ తోపాటు అన్ని యూపీఐలకు ఇదే రూల్ వర్తిస్తుంది.
కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్పులు..
ఎన్‌పీసీఐ ప్రకారం.. దాదాపు అన్ని డిజిటల్ పేమెంట్ సంస్థలు నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేశాయి. ఈ మార్పుతో యూపీఐ యూజర్ల(UPI users)కు భద్రత పెరుగుతుందని సంస్థ పేర్కొంది. వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేస్తుందని తెలిపింది. యూపీ ట్రాన్‌జాక్షన్స్ విలువ ప్రతినెలా పెరుగుతూ పోతున్నందున ఈమేరకు నిబంధనలు మార్చింది. గతేడాది డిసెంబర్‌లో యూపీఐ ట్రాన్‌జాక్షన్ సంఖ్య ఏకంగా 16.73 బిలియన్లకు చేరింది. నవంబర్ కన్నా ఇది 8 శాతం ఎక్కువ. విలువ పరంగా రూ.23.25 లక్షల కోట్లకుపైనే ఉంటుంది.