https://oktelugu.com/

Nitish Kumar Reddy : అరే అజామూ.. ఐపీఎల్ లో నితీష్ హవా షురూ

Nitish Kumar Reddy : ఐపీఎల్(IPL) లో ఈసారి 10 జట్లు పాల్గొంటున్నాయి. 10 జట్లలో హైదరాబాద్( SRH) జట్టుకు మాత్రమే విదేశీ ఆటగాడు నాయకత్వం వహిస్తున్నాడు.

Written By: , Updated On : March 21, 2025 / 09:06 AM IST
Nitish Kumar Reddy

Nitish Kumar Reddy

Follow us on

Nitish Kumar Reddy : ఐపీఎల్(IPL) లో ఈసారి 10 జట్లు పాల్గొంటున్నాయి. 10 జట్లలో హైదరాబాద్( SRH) జట్టుకు మాత్రమే విదేశీ ఆటగాడు నాయకత్వం వహిస్తున్నాడు. మిగతా 9 జట్లకు స్వదేశీ ఆటగాళ్లు నాయకత్వం వహిస్తున్నారు. గత సీజన్లో కోల్ కతా(KKR) విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు(SRH)ను ఓడించి ట్రోఫీని అందుకుంది. అయితే ఈసారి అన్ని జట్లు బలంగా ఉండడంతో పోటీ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ జట్టు మార్చి 23న ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan royals) జట్టుతో తలపడునుంది. ఇప్పటికే హైదరాబాద్ ఆటగాళ్లు రాజీవ్ గాంధీ స్టేడియంలో కొద్దిరోజుల నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. బ్యాటర్లు పేస్, స్పిన్ బౌలర్లతో తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఇక స్పిన్, పేస్ బౌలర్లు రఫ్ పిచ్ పై విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మొత్తంగా ఆరెంజ్ ఆర్మీ ప్రాక్టీస్ తో ఉప్పల్ స్టేడియం నారింజ వర్ణాన్ని సంతరించుకుంది.

Also Read : నచ్చావ్ నితీష్ కుమార్ రెడ్డి.. తండ్రి మీద నీ ప్రేమకు హాట్సాఫ్!

తెలుగు ఆటగాడు అదరహో

హైదరాబాద్ జట్టులో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కీలకంగా ఉన్నాడు. గత సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. దీంతో అతడు జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మెరుగైన పరుగులు సాధించి నితీష్ కుమార్ రెడ్డి ఆకట్టుకున్నాడు. పొట్టి ఫార్మాట్ లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఐపిఎల్ లో అతడు హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ తో నితీష్ కుమార్ రెడ్డి ఆకట్టుకుంటున్నాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా ప్రాక్టీస్ సెషన్ కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ నితీష్ కుమార్ రెడ్డి అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా తోటి ఆటగాళ్లతో చిన్న హాస్య స్ఫోరకమైన వీడియోను నితీష్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తోటి ఆటగాళ్లకు తెలుగు నేర్పిస్తూ అతడు ఒక ట్యూటర్ గా మారిపోయాడు.. తెలుగు ప్రజలందరికీ నమస్కారం అని అనాలని తోటి ఆటగాళ్లకు నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) చెప్పగా.. వారు ఆ పదాలను వచ్చిరాని తెలుగులో మాట్లాడి నవ్వులు తెప్పించారు. నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) సోషల్ మీడియాలో అభిమానులను అలరించడానికి ఇలాంటి వీడియో పోస్ట్ చేశాడని సన్ రైజర్స్ హైదరాబాద్(sunrisers Hyderabad) యాజమాన్యం పేర్కొంది. ఇక ఈ వీడియో చూసిన తెలుగు అభిమానులు. “ఒరేయ్ అజామూ.. నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) హైదరాబాద్(sunrisers Hyderabad Team) జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు రా” అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

Also Read : గౌతమ్ గంభీర్ నిర్వాకం.. నితీష్ కుమార్ రెడ్డి కెరియర్ ప్రమాదంలో పడిందా?