https://oktelugu.com/

NPCIL Recruitment 2021: బీటెక్ విద్యార్థులకు శుభవార్త.. ప్రముఖ సంస్థలో భారీ వేతనంతో జాబ్స్!

NPCIL Recruitment 2021: న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గేట్ స్కోర్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2022 గేట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ నియామకాలను చేపట్టనున్నారని సమాచారం. ప్రస్తుతం గేట్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్లు ఈ […]

Written By: , Updated On : September 29, 2021 / 07:15 PM IST
Follow us on

NPCIL Recruitment 2021: న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గేట్ స్కోర్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2022 గేట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ నియామకాలను చేపట్టనున్నారని సమాచారం.
npcil recruitment 2021
ప్రస్తుతం గేట్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్లు ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సులభంగా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సివిల్‌, కెమికల్, మెకానికల్ బ్రాంచ్ లకు చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్ లేదా తత్సమాన అర్హత ఉండి 2020, 2021, 2022 సంవత్సరాల గేట్ స్కోర్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు షార్ట్ లిస్ట్ అవుతారో వారిని పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. 2022 సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.

https://npcilcareers.co.in/mainsite/default.aspx వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుంది.

Tags