Voter Slip: తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జగనునున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 28న ప్రచారం ముగిసింది. 29న ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తారు. 30న పోలింగ్ నిర్వహిస్తారు. అయితే కొన్ని కారణాల వల్ల చాలా మందికి ఇప్పటికీ ఓటర్ స్లిప్పులు అందని వాళ్లు ఉన్నారు. ఓటు వేయాలని ప్రభుత్వం అవగాహన కల్పించడంతో పాటు ఎప్పటికప్పుడు ఓటరు స్లిప్పులను పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది. అయినా కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు స్లిప్పులను అందుకోలేదు. అయితే ఓటరు స్లిప్పులు లేకపోయినా ఓటు వేయొచ్చు. ఆన్ లైన్ లో ఓటరు కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణలో ఎన్నికల కోలహాలం మొదలయ్యాక ఓటర్ల సవరణ చేశారు. ఈ క్రమంలో చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో కొత్తగా నమోదు చేసుకున్నారు. మరికొందరు 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. మొత్తం ఓటర్ల జాబితాను సిద్ధం చేసి నవంబర్ 25 నుంచి స్లిప్పులు అందజేశారు. కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రాంతాలకు ఓటరు స్లిప్పులు అందలేదు. దీంతో వారు చాలా ఆందోళన చెందుతున్నారు. తాము ఓటు ఎలా వేసేది? అని అంటున్నారు.
అయితే ఓటరు స్లిప్పులు రాకున్నా ఓటు వేయొచ్చు. ఎపిక్ నెంబర్ తెలుసుకుంటే దాని ద్వారా ఓటరు లిస్టులో పేరు చూసుకొని ఐడెంటిటీ కార్డు ద్వారా ఓటు వేయొచ్చు. ఎపిక్ నెంబర్ కూడా తెలియకుండా ఓటు నమోదు చేసుకున్నవారు 1950కి కాల్ చేసి తమ వివరాలు అందిస్తే ఎపిక్ నెంబర చెబుతారు. దీని ద్వారా ఓటరు లిస్టులో తమ పేరు చూసుకొని ఓటు వేయొచ్చు.
ఎపిక్ కార్డు కావాలనుకునేవారు మాత్రం ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుకోసం voters.eci.gov.inకి వెళ్లి సెర్చ్ ఇన్ ఎలక్ట్రోరల్ రోల్ పై క్లిక్ చేయాలి. ఇందులో ఎపిక్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఓటరు స్లిప్ వస్తుంది. దీనిని డౌన్లోడ్ చేసుకొని ఓటు వేయొచ్చు. ఇది సాయధ్యం కాని వారు మీ సేవ కు వెళ్లి ఎపిక్ నెంబర్ వివరాలు చెప్పినా ఓటరు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు