Animal: చిరంజీవి ఒక్కప్పటి ప్లాప్ సినిమా కథతో తెరకెక్కిన అనిమల్ మూవీ…

సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మెగాస్టార్ అనే రేంజ్ ని దాటుకొని ముందుకు వెళుతున్న మెగాస్టార్ చిరంజీవికి ఎన్ని ప్రశంసలు ఇచ్చిన చాలా తక్కువే అవుతుంది.

Written By: Gopi, Updated On : November 29, 2023 9:26 am

Animal

Follow us on

Animal: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలుగా చాలామంది హీరోలు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీలో వాళ్లే స్టార్లుగా ఎదుగుతు మంచి విజయాలను అందుకునేవారు. ఇక ఈ సమయంలో ఇండస్ట్రీకి వచ్చి తనదైన రీతిలో సినిమాల్లో హీరోగా చేసి మీద సక్సెస్ కొడుతూ ఇండస్ట్రీలో తను ఒక గొప్ప హీరోగా ఎదిగిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా చిరంజీవి అనే చెప్పాలి.

సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మెగాస్టార్ అనే రేంజ్ ని దాటుకొని ముందుకు వెళుతున్న మెగాస్టార్ చిరంజీవికి ఎన్ని ప్రశంసలు ఇచ్చిన చాలా తక్కువే అవుతుంది. ఇక ఇది ఇక ఉంటే ఇప్పుడు సందీప్ రెడ్డివంగ డైరెక్షన్ లో రన్బీర్ కపూర్ హీరోగా వస్తున్న అనిమల్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని చూసిన చాలామంది అభిమానులు ఈ సినిమా స్టోరీ ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి హీరోగా వచ్చిన కిరాతకుడు అనే సినిమా స్టోరీ తో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు అభిమానులు ఆ సినిమాకి ఈ సినిమాకి మధ్య కొన్ని పోలికలను చెబుతున్నారు ఆ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య గొడవ అనేది ఉంటుంది.ఇక తండ్రి ఉన్నత చదువులు చదివి గొప్పగా బతుకుతున్న వ్యక్తి కావడం అలాగే కొడుకు కూడా తన రేంజ్ లో బతకాలని కోరుకుంటాడు ఆ క్రమంలో కొడుకు మాత్రం రౌడీ కా మారిపోయి చాలామందిని చంపుతూ ఉంటాడు.ఇక ఇలాంటి క్రమంలోనే అనిమల్ సినిమా కూడా కొంచం డిఫరెంట్ తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కింది. కాబట్టి ఆల్మోస్ట్ ఈ రెండు సినిమాల కథ లు ఒకే విధంగా ఉండబోతున్నాయి అని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో చివర్లో వాళ్ళ నాన్న ఒక ప్రమాదంలో ఉంటే కాపాడిన హీరో వాళ్ల నాన్న దృష్టిని ఆకర్షిస్తాడు అలాగే అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ కూడా ఆయన అనిల్ కపూర్ ప్రశంసలని చివరికి పొందుతాడా లేదా అనే పాయింట్ తోనే ఈ సినిమా తెలుగు తెరకెక్కింది.

అయితే ఈ సినిమా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కనప్పటికీ ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ అనేది చాలా ప్లస్ పాయింట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా స్టోరీ విషయాన్ని పక్కన పెడితే మేకింగ్ లోనే సందీప్ తన దమ్ము ఏంటో చూపించాలనే రీతిలో ఒక అద్భుతాన్ని చేసారు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు…ఇక చిరంజీవి చేసిన ఈ కిరాతకుడు సినిమా అప్పట్లో ఫ్లాప్ అయింది. అయితే ఎనిమల్ సినిమా ఆ కథ తోనే వస్తుందా, లేదా సపరేట్ స్టోరీ తో వస్తుందా అనే విషయాలు తెలియాలి అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…