TTD- Swamijis New Political Party: తిరుమల.. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం.. నిత్య కళ్యాణం, పచ్చ తోరణంగా భాసిల్లుతూ ఉంటుంది. రోజుకు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు రోజూ వస్తూ ఉంటారు. అలాంటి తిరుమల నేడు రాజకీయ క్షేత్రం అయిపోయింది. గత మూడేళ్లుగా వ్యాపార కేంద్రంగా మారిపోయింది. భక్తులకు అందించే లడ్డులో నాణ్యత లేదు. బ్రేక్ దర్శనాలకు అంతు పొంతు లేదు. పైగా అన్యమత ప్రచారం జరుగుతున్నది.. అన్య మతస్థులు టీటీడీ లో కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇలాంటి సమయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా తిరుమల ప్రతిష్ట మంట కలిసి పోతుంది. ఈ నేపథ్యంలో స్వయంగా పీఠాధిపతులు రంగంలోకి దిగారు.

-భక్తులకు నరకం చూపిస్తున్న టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి 20కి.మీల దూరం.. పెద్దలు ఇంత దూరం నడుస్తారు.. కానీ పిల్లలు, వృద్ధుల పరిస్థితి ఏంటి. బుద్ది ఉన్నోడు ఎవడైనా ఇలాంటి ఏర్పాట్లు చేస్తారా? అసలు టీటీడీకి భక్తులపై కనీసం కనికరం ఉందా? చంద్రబాబు ప్రభుత్వంలో సర్వదర్శనం (ఉచిత దర్శనం), శీఘ్రదర్శనం (కాలినడకన), ప్రత్యేక దర్శనం (రూ.300) టికెట్లు పెట్టి పద్ధతి ప్రకారం టోకెన్ సిస్టం ఇచ్చి ఆ టైంకే కంపార్ట్ మెంట్లలోకి పంపేవారు. కానీ ఇప్పుడు వాటన్నింటిని ఎత్తేశారు. బ్రహ్మోత్సవాలు అంటూ.. తమిళ పెరటాసి మాసం అంటూ భక్తుల భారీ రాకతో అన్నింటిని రద్దు చేశారు. ఎంత మంది తిరుమల వచ్చినా గుడికి దూరంగా వదిలి 20 కి.మీలు నడిపించి కనీసం టోకెన్లు ఇవ్వకుండా రెండు రోజుల పాటు నరకం చూపించి నిజంగానే ఆ దేవుడిని చూడడానికి చుక్కలు కనిపించేలా చేస్తున్నారు. ఇంతటి దౌర్భగ్యమైన దారుణ వ్యవస్థ ఏపీలో మరొకటి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు, చంటి బిడ్డలు ఆకలి దప్పులకు అలమటిస్తూ ఏడ్చిన ఏడుపులు ఈ టీటీడీ పెద్దలకు,ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులకు కనిపించడం లేదా? అన్నది భక్తుల ప్రశ్న. పాపవినాశనం నుంచి ఆలయం వరకూ కూడా ఒక్క టీటీడీ అధికారి కాని.. ఒక్క పోలీస్ కానీ కనిపించరు. క్యూలల్లో భక్తులను వారి చావుకు వారిని వదిలేశారు. కనీసం నీరు, ఆహారం అందించేవారు లేరు. ఓవైపు వర్షం, చల్లగాలికి అందరూ వణికిపోయే పరిస్థితి. ఏవో నల్లాలు పెట్టి తాగండని వదిలేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ క్యూలు, తోపులాటల్లో నడవలేక నరకం చూశారు.
Also Read: Jagan- Central Govt: ఏపీకి కేంద్రం భారీ నిధులు: జగన్ కు సపోర్టా? పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ నా?
– మహా ద్వారం నుంచి పంపించరట
భక్తుల పరిస్థితి ఇలా ఉంటే తిరుమల క్షేత్రంలోకి స్వామివారి దర్శనానికి పీఠాధిపతులను మహా ద్వారం నుంచి పంపించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా ఉంది. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నిబంధన గాలిలో కలిసిపోయింది. అక్కడ అధికార పార్టీ రాజ్యం నడుస్తున్నది. ఒక మతానికి సంబంధించిన కరపత్రాలు తిరుపతిలో ప్రత్యక్షం అయ్యాయి అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక ఇటీవల తిరుపతిలో స్వామివారి దర్శనానికి 30 మంది పీఠాధిపతులు వచ్చారు. వీరంతా కూడా వివిధ రాష్ట్రాలకు చెందినవారు.. అయితే తమకు ఎటువంటి సమాచారం లేదని భద్రత సిబ్బంది వీరిని నిలిపివేశారు. అయితే పీఠాధిపతులు తమరాకను లేఖ ద్వారా దేవస్థానానికి ముందే చెప్పారు. అయినప్పటికీ వారికి దర్శన భాగ్యం కల్పించడంలో దేవస్థానం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.. వారిని అక్కడే నిలిపి వేసి అవమానించింది. తిరుమల చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడూ జరగ లేదు.
-కొత్త పార్టీ పెట్టే యోచనలో..
తిరుమల గౌరవానికి భంగం కలిగించేలా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పీఠాధిపతులు నిర్ణయించారు.. తనకే దర్శన భాగ్యం కలిగించకుంటే.. సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి అని వారు ఆరోపించారు. అనంతరం శ్రీనివాస మంగాపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.. విజయవాడ శ్రీ యోగి పీఠం అధిపతి అతిథిశ్వరానంద పర్వత స్వామి అయితే సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమలలో ధనవంతులకు, రాజకీయ నేతలకు స్వేచ్ఛగా దర్శన భాగ్యం కలుగుతున్నదని, సామాన్య భక్తులను అసలు పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు . అఖిలభారత హిందూ మహాసభ ద్వారా తిరుమలలో జరుగుతున్న అరాచకాలను భక్తుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.. తిరుమలలో తక్షణ మార్పులు జరగకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 900మంది పీఠాధిపతుల ఆశీస్సులతో త్వరలో ఆంధ్రప్రదేశ్లో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. తిరుమలలో సామాన్య భక్తులు స్వేచ్ఛగా వెళ్లి స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేయాలన్నారు.

-పెరిగిన అక్రమాలు
పీఠాధిపతులు ఆరోపించినట్టే తిరుమలలో అక్రమాలు పెరిగాయి.. ఈ మూడేళ్లలో అవి కని విని ఎరుగని స్థాయిలో పెరిగిపోయాయి. అధికార పార్టీ నాయకులు టీటీడీ బోర్డులో చేరిపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొండపైకి అన్యమత ప్రచారాన్ని అనుమతిస్తున్నారు. పైగా తమకు నచ్చిన వారికి దర్శనం భాగ్యం కల్పిస్తున్నారు.. ఇదే సమయంలో తమ సొంత పనులు చక్క పెట్టుకుంటున్నారు. ఇటీవల సినీ నటి రోజా జబర్దస్త్ నటులతో తిరుమల వచ్చారు. ఆ సమయంలో వారు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.. పైగా రోజా మంత్రి అయినప్పటి నుంచి సిఫారసులు పెరగడం తో టీటీడీ అధికారులకు నరకం కనిపిస్తోంది. పీఠాధిపతులు వచ్చినప్పుడే కాదు.. విఐపి లు వచ్చినప్పుడు కూడా భద్రతా సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉంది. అయితే పీఠాధిపతులు రాజకీయ పార్టీ పెడతామని ప్రకటించిన నేపథ్యంలో.. సర్కారు తీరులో, తిరుమల తిరుపతి దేవస్థానం పనితీరులో మార్పు రావాలని భక్తులు కోరుకుంటున్నారు.