Jagan- Central Govt: ఏపీకి కేంద్రం భారీ నిధులు: జగన్ కు సపోర్టా? పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ నా?
Jagan- Central Govt: ఏపీలో వైసీపీ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించేందుకు నిర్ణయించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ అడిగిన కోరికలను నెరవేరుస్తోంది. కీలక ప్రాజెక్టులకు, నిర్మాణాలకు భారీగా నిధులు మంజూరు చేస్తోంది. ఏకంగా ఏపీకి 9 వేల కోట్లు కేటాయించింది. జగన్ కేంద్ర ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనలన్నింటికీ మోక్షం కలిగించింది. రాయలసీమలో ఏకంగా తొమ్మిది జాతీయ రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటన్నింటికీ ఈ నెల 28న భూమిపూజ చేసేందుకు కూడా […]

Jagan- Central Govt: ఏపీలో వైసీపీ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించేందుకు నిర్ణయించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ అడిగిన కోరికలను నెరవేరుస్తోంది. కీలక ప్రాజెక్టులకు, నిర్మాణాలకు భారీగా నిధులు మంజూరు చేస్తోంది. ఏకంగా ఏపీకి 9 వేల కోట్లు కేటాయించింది. జగన్ కేంద్ర ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనలన్నింటికీ మోక్షం కలిగించింది. రాయలసీమలో ఏకంగా తొమ్మిది జాతీయ రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటన్నింటికీ ఈ నెల 28న భూమిపూజ చేసేందుకు కూడా నిర్ణయించింది. సీఎం జగన్ ఇటీవల ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో సమావేశమైన తరుణంలో కేంద్రప్రభుత్వం ఆమోదముద్ర వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయంగా ఇది జగన్ సర్కారుకు ప్లస్ పాయింట్ గా నిలిచే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ సర్కారును కేంద్రం కట్టడి చేయనుందని వార్తలు వచ్చిన తరుణంలో ఏపీకి భారీగా నిధులు కేటాయించడం హాట్ టాపిక్ గా మారింది.

pawan kalyan, Jagan-Modi
కొద్ది నెలల కిందట విజయవాడ వేదికగా చేసుకొని రూ.15 వేల కోట్లతో నిర్మించనున్న రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, సీఎం జగన్ సంయుక్తంగా భూమిపూజ చేశారు. ఇప్పుడు రెండో దశలో రాయలసీమలో 412 కిలోమీటర్ల రహదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలన్నింటినీ కేంద్రం యథావిధిగా ఆమోదం తెలిపింది. పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి సంకల్పించింది. వాటికి ఎటువంటి అభ్యంతరాలు తెలపకుండా కేంద్రం నిధులు విడుదల చేయడమే కాకుండా.. పనులు పట్టాలెక్కించేందుకు రోజుల వ్యవధిలో భూమిపూజకు సిద్ధపడడం చర్చనీయాంశమైంది.
ఈ నెల 28న తిరుపతిలో ఈ రహదారుల నిర్మాణానికి భూమిపూజ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో పాటు సీఎం జగన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటికే రూ.204 కోట్లతో నిర్మించిన 19 కిలోమీటర్ల మేర రహదారును సైతం ఇదే వేదిక నుంచి ప్రారంభించనున్నారు. అటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఏపీ పర్యటన ఖరారైంది. 27న ఆయన తిరుమల చేరుకోనున్నారు. 28 న శ్రీవారిని దర్శించుకొని భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనున్నారు. మౌలిక వసతులు, రహదారుల నిర్మాణంలో సంపూర్ణ సహకారం అందిస్తామని కొద్ది రోజుల కిందట గడ్కరి హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా కీలక ప్రాజెక్టులను ప్రకటించడమే కాకుండా.. జాప్యం జరగకుండా పనులకు శ్రీకారం చుడుతుండం విశేషం.

pawan kalyan, Jagan-Modi
ప్రస్తుతం ఏపీలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి జనసేన మిత్రపక్షంగా ఉంది. ప్రధాని విశాఖ పర్యటనలో కూడా పవన్ కు ప్రత్యేకంగా ఆహ్వానించి కీలకాంశాలు చర్చించారు. ఆ సమావేశం అనంతరం పవన్ ప్రకటన చేశారు. తమ సమావేశంతో ఏపీకి అన్నిరకాల ప్రయోజనాలు సమకూరుతాయని చెప్పారు. అయితే ఏపీలో జనసేనతో కలిసి నడవాలనుకున్న బీజేపీ నేరుగా ఏపీకి నిధుల వరద ప్రకటించడం మాత్రంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అభివృద్ధి మంత్రంతో ఏపీలో అడుగు వేయాలని బీజేపీ భావిస్తున్నట్టుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అటు పవన్ కూడా ప్రధాని ఇదే చెప్పారని.. తమ పని తాము చేస్తామని….ప్రజలను కూటమి వైపు మళ్లించే బాధ్యత తీసుకోవాలని పవన్ కు సూచించారని చెబుతున్నారు. ఇప్పుడు ఉన్నఫలంగా నిధుల వరద వెనుక కారణం అదేనని గుర్తుచేస్తున్నారు
