Itlu Maredumilli Prajaneekam Review: అల్లరి నరేష్ తన పంథా మార్చి కామెడీ చిత్రాలకు బదులు సీరియస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. ఓ సాలిడ్ హిట్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కోరుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా అల్లరి నరేష్ చేసిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’. ఈ మూవీ నేడు విడుదల కాగా అంచనాలు అందుకుందో లేదో చూద్దాం.

కథ
గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయిన శ్రీనివాస్ శ్రీపాద(అల్లరి నరేష్) నీతి, నిబద్ధత, బాధ్యతాయుతమైన వ్యక్తి. ఆయన ఎలక్షన్ డ్యూటీపై మారేడుమిల్లి అనే ఒక తండాకు వెళతారు. ప్రభుత్వ గుర్తింపుకు, ఆదరణకు నోచుకోకుండా అడవిలో మగ్గిపోతున్న మారేడుమిల్లి జనాల జీవితాలు శ్రీనివాస్ ని కదిలిస్తాయి. అక్కడ జరుగుతున్న అన్యాయాలు, వాళ్ళు కోల్పోతున్న జీవితాన్ని బాహ్యప్రపంచానికి చెప్పాలి అనుకుంటాడు. అందుకోసం వ్యవస్థకే వ్యతిరేకంగా యుద్ధం మొదలు పెడతాడు. మారేడుమిల్లి ప్రజానీకం కోసం శ్రీనివాస్ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది? అనేదే మిగతా కథ…
విశ్లేషణ:
అల్లరి నరేష్ గత చిత్రం నాంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. న్యాయవస్థలోని లోపాలు, పోలీసుల అరాచకాలు ప్రశ్నిస్తూ తెరకెక్కిన ఆ మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. అదే తరహాలో మరో సోషల్ బర్నింగ్ టాపిక్ ని నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీకి ఎంచుకున్నాడు. స్వాతంత్య్ర భారతంలో ఇంకా నిరాదరణకు గురవుతున్న జనాలు, వారు కోల్పోతున్న హక్కులు, వారిపై జరుగుతున్న అన్యాయాలు ప్రధానాంశంగా వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఏ ఆర్ మోహన్ తెరకెక్కించారు.
కమర్షియల్ అంశాలు టచ్ చేయకుండా దర్శకుడు మోహన్ సూటిగా తన పాయింట్ చెప్పాలనుకున్నారు. అల్లరి నరేష్ నుండి ఆశించే కామెడీ కూడా ఆశించిన స్థాయిలో ఈ మూవీలో ఉండదు. వెన్నెల కిషోర్ తో కొంచెం నవ్వించడానికి ట్రై చేశాడు. సినిమా ఆద్యంతం సీరియస్ నోట్ లో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ పాత్రల పరిచయం, నేపథ్యం గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. సెకండ్ హాఫ్ మూల కథ మొదలవుతుంది.

ఇంటర్వెల్ సన్నివేశాలతో పాటు పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కథ వాస్తవ పరిస్థితులు గుర్తు చేస్తుంది. సీరియస్’ ఎమోషనల్ చిత్రాలు నరేష్ కి కొత్తేమీ కాదు. కెరీర్ బిగింగ్ లోనే ఆయన నేను, ప్రాణం వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. ఆ జోనర్లో ఆయన రక్తికటించగలడు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంలో మరోసారి రుజువు చేసుకున్నాడు. ఎమోషనల్, సీరియస్ సన్నివేశాల్లో నరేష్ నటన అద్భుతమని చెప్పాలి.
ఇక హీరోయిన్ ఆనందితో పాటు కీలక రోల్స్ చేసిన నటులు తమ పాత్ర పరిధిలో మెప్పించారు. సాంకేతిక అంశాలు పర్వాలేదు అన్నట్లు ఉన్నాయి. కమర్షియల్ అంశాలు లేకపోవడం, స్లోగా సాగే స్క్రీన్ ప్లే నిరాశపరిచే అంశాలు. అల్లరి నరేష్ మూవీ అంటే కనీస స్థాయి కామెడీ కోరుకుంటారు. అది కూడా ఈ మూవీలో కనిపించదు. అలాగే హిందీ హిట్ మూవీ న్యూటన్ ని పోలి ఉంటుంది.
ప్లస్ పాయింట్స్:
అల్లరి నరేష్ నటన
కథ
పతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
కమర్షియల్ ఎలిమెంట్స్
స్క్రీన్ ప్లే
సినిమా చూడాలా? వద్దా?:
ఒక సామాజిక అంశాన్ని నిజాయితీగా చెప్పిన దర్శకుడిని మెచ్చుకోవాలి. కామెడీ హీరోగా పేరున్న అల్లరి నరేష్ యాక్టింగ్ మెప్పిస్తుంది. కమర్షియల్ అంశాలు లేకపోవడం, స్లోగా సాగే నేరేషన్ నిరాశపరిచే అంశాలు. ఒకసారి చూడదగ్గ చిత్రమే…
రేటింగ్: 2.75/5