BJP: ఏపీలో ఎలాగైనా తమ పార్టీ బలోపేతం కావాలని బీజేపీ నేతలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలంలో మతం గురించి మాట్లాడిని బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా హైలైట్ కావాలని ప్రయత్నించారు. అలా ఏపీలోని అధికార వైసీపీపైన పోరాటానికి పూనుకున్నారు. ఆ పార్టీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు, ఇతర నేతలు ఘాటుగానే విమర్శలు చేశారు.

కర్నూలులో సభ పెట్టి మరీ వైసీపీని టార్గెట్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. అలా చేసిన వారిని జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ ద్రోహి అని ఆరోపించారు సోము వీర్రాజు. కానీ, ఆ విషయాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు కనబడటం లేదు. ప్రజాసమస్యల మీద పలు ప్రకటనలను బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు చేస్తున్నప్పటికీ పెద్దగా స్పందన అయితే రావడం లేదు.
Also Read: ఈ యాక్టర్లను స్టార్ డైరెక్టర్లు సెంటిమెంట్ గా భావిస్తున్నారు తెలుసా..!
ఏపీ బీజేపీ నేతలు బయటకు వైసీపీని విమర్శిస్తున్నప్పటికీ లోపల ఎక్కడో వైసీపీకి సహకరిస్తున్నారనే అనుమానం అయితే ఏపీ ప్రజల్లో ఉంది. ఈ క్రమంలోనే ఆ అనుమానం నివృత్తి చేసేందుకుగాను ఏపీ బీజేపీ నేతలు ఒకరకంగా విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ, ఫలితం అయితే పెద్దగా కనబడటం లేదు.
వైసీపీ అధినేత జగన్, ఇతర నేతలపైన బీజేపీ వారు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఇక కౌంటర్‌గా వైసీపీ వారు సైతం బీజేపీ లీడర్లను తిట్టి పోస్తున్నారు. అలా దూషణల పర్వం కొనసా..గుతున్నది. తప్ప బీజేపీకి పెద్దగా కలిసొచ్చే అవకాశాలు అయితే ఏం కనబడటం లేదనే వాదన ఉంది.

వైసీపీకి బీజేపీ మేలు చేస్తుందనే అభిప్రాయాన్ని పోగొట్టి తనకంటూ సొంత శక్తిని కూడగట్టుకునే ప్రయత్నం చేయాల్సిన బీజేపీ ఆ స్థాయిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. కానీ, సక్సెస్ కాలేకపోతున్నదనే వాదన అయితే ఉంది. గత కొద్ది రోజుల నుంచి ఏపీ బీజేపీ నేతలు పార్టీని బలోపేతం చేయడంతో పాటు తాము ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకుగాను ప్రయత్నిస్తున్నారు. కానీ, పెద్దగా ఫలితం అయితే కనబడటం లేదు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఇకపోతే రాష్ట్రంలో జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఇరువురు కలిసి ఉమ్మడిగా పోరాడిన సంఘటనలు అయితే లేవు.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా..?