https://oktelugu.com/

పులివెందులలో జీవోలే తప్ప పనులేవి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల. గత రెండేళ్లలో వేల కోట్ల పనులకు జీవోలు, శంకకుస్థాపనలు చేశారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. శంకుస్థాపనలు, శిలాఫలకాలకే పరిమితమైపోతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులివెందులతో పాటు బద్వేలులోనూ శంకుస్థాపనలు విచ్చలవిడిగా చేస్తున్నారు. కానీ పనులుమాత్రం మొదలు పెట్టడం లేదు. సుమారుగా నాలుగు వందల కోట్ల పనులకు జీవోలిచ్చినా ఇప్పటివరకు ఏ ఒక్క పని కూడా ప్రారంభం చేయకపోవడం గమనార్హం. పులివెందులకు సీఎం […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 8, 2021 / 03:25 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల. గత రెండేళ్లలో వేల కోట్ల పనులకు జీవోలు, శంకకుస్థాపనలు చేశారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. శంకుస్థాపనలు, శిలాఫలకాలకే పరిమితమైపోతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులివెందులతో పాటు బద్వేలులోనూ శంకుస్థాపనలు విచ్చలవిడిగా చేస్తున్నారు. కానీ పనులుమాత్రం మొదలు పెట్టడం లేదు. సుమారుగా నాలుగు వందల కోట్ల పనులకు జీవోలిచ్చినా ఇప్పటివరకు ఏ ఒక్క పని కూడా ప్రారంభం చేయకపోవడం గమనార్హం.

    పులివెందులకు సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లినప్పుడల్లా ఏవో శంకుస్థాపనలు చేయడం పరిపాటిగా మారింది. వైఎస్ జయంతి, వర్ధంతి, క్రిస్మస్ పండుగల సందర్భాల్లో జగన్ ఇక్కడికి వస్తుంటారు. ఇప్పటి వరకు 30 జీవోలు విడుదల చేసి దాదాపు రూ.1300 కోట్ల విలువైన పనులు చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ ఇంతవరకు ఏ హామీ నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంపై ప్రత్యేకంగా సమీక్ష చేసినా ప్రయోజనం శూన్యమే.

    గత రెండేళ్ల కాలంలో పులివెందులలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా పూర్తి కాలేదు. అన్ని జీవోలకే పరిమితమైపోయాయి. సొంత నియోజకవర్గం కూడా హామీలకే పరిమితమైపోయిందని విమర్శలు వస్తున్నాయి. పులివెందులకు కనీసం బస్ స్టేషన్ కూడా లేదు. ప్రపంచస్థాయిలో బస్టాండ్ నిర్మిస్తామని చెప్పినా అది కూడా ఆచరణ రూపం దాల్చలేదు. దీంతో విపక్షాలు సైతం సెటైర్లు వేస్తున్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే నానుడి ఉండడంతో అందరు ఇక్కడే గెలిచి చూపించాలని సవాల్ విసురుతున్నారు.

    ప్రభుత్వం చేపట్టిన రెండేళ్లలో కనీసం ఒక్క పని కూడా చేయకపోవడం గమనార్హం. సీఎం సొంత ఊరు కావడంతో ఇక్కడ అభివృద్ధి పనులు పరుగులు పెడతాయని అంతా భావించారు. కానీ అంతా వట్టిదే అని తేలిపోయింది. దీంతో సీఎంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల పనులు ప్రారంభం చేసినా వాటిని పూర్తి చేయకపోవడంతో ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.