
బాధ్యతలు చేపట్టిన తొలిరోజు కొత్త ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ కు వార్నింగ్ ఇచ్చారు. దేశంలో నివసించే, పనిచేసే వారు ఇక్కడి నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. రైల్వే, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం భాజపా ఆర్గనైజేషన్ సెక్రటరీతో ఆయన గురువారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ట్విటర్ గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.