
టీపీసీసీ అధ్యక్షుడిగా తనను కాదని రేవంత్ రెడ్డిని నియమించడంపై ఎంపీ కోమటిరెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఆయన ఇవాళ వివరణ ఇచ్చారు. తనకు పీసీసీ పదవి రాలేదన్న ఆవేదనతోనే అలా మాట్లాడానన్నారు. సీనియర్ నేతగా మాట్లాడానే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా భువనగరిలో వైఎస్ ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా పార్టీల నుంచి నాకు ఆహ్వానాలు అందాయి. ఏ పార్టీలో చేరను కాంగ్రెస్ లోనే కొనసాగుతా అని తెలిపారు.