https://oktelugu.com/

జగన్ కు కేసుల ఫీవర్ పోలేదా?

రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరును బట్టి చూస్తే బీజేపీ అంటే వైసీపీకి భయమనే విషయం స్పష్టం అవుతుంది. ఇందుకు కారణం సీఎం జగన్ పై ఉన్న సీబీఐ, ఇడి కేసులే. ఈ కేసుల నుంచి జగన్ ఇంకా బయట పడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ నేతలు విమర్శలు చేసినా వైసీపీ నేతలు ఎవరు నోరు మెదపడం లేదు. ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2020 11:49 am
    Follow us on


    రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరును బట్టి చూస్తే బీజేపీ అంటే వైసీపీకి భయమనే విషయం స్పష్టం అవుతుంది. ఇందుకు కారణం సీఎం జగన్ పై ఉన్న సీబీఐ, ఇడి కేసులే. ఈ కేసుల నుంచి జగన్ ఇంకా బయట పడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ నేతలు విమర్శలు చేసినా వైసీపీ నేతలు ఎవరు నోరు మెదపడం లేదు. ఈ విషయంలో జగన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం గట్టిగా జవాబు ఇస్తున్నారు.

    జులై నుంచి కొత్త లాక్ డౌన్ రూల్స్?

    కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర కార్యకర్తలను ఉద్దేశించిన ప్రసంగించే క్రమంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం విద్యుత్ యూనిట్ రూ.2.70 లకు ఇస్తుంటే రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం రూ.9 వసూలు చేస్తుందన్నారు. అవినీతి పెరిగిందని, ఇతర మరికొన్ని విమర్శలు చేశారు. దీనిపై వైసీపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ స్పందించకుండా, ప్రభుత్వ సలహాదారు, మాజీ సీఎస్ అజయ్ కల్లంతో సమాధానం ఇప్పించారు. గతంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఆ పార్టీ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినా వైసీపీ నేతలు ఎవరూ స్పందించలేదు. ఇవి రాజకీయ పరమైన అంశాలు కాదన్నట్లు వ్యవహారించారు.

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులకు ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చిన విధంగా కాపు కార్పొరేషన్ కు ఏడాదికి రూ.2 వేల కోట్లు కేటాయించక పోవడం, కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రశ్నిస్తే వైసీపీలో ఉన్న కాపు నేతలు రోజుకు ఇద్దరు చొప్పున పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కేవలం విమర్శలు చేయడమే రాజకీయంగా భావించడం లేదు. కరోనా సమయంలో ఈ అంశంపై ఎటువంటి విమర్శలు చేయకుండా, ప్రభుత్వానికి కావాల్సిన సహకారం అందిస్తామని ముందుకు వచ్చిన పార్టీ రాష్ట్రంలో జనసేన ఒక్కటే. ఆ విషయాన్ని వైసీపీ గుర్తించడం లేదు. పవన్ వెనుక చంద్రబాబు ఉన్నారనే భావనతోనే వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తోందనే వాదనలు ఉన్నాయి. అందుకే టీడీపీ నుంచి వైసీపీ లోకి వచ్చిన ఆమంచి, తోట త్రిమూర్తులను పవన్ పైకి ఉసిగొల్పింది.

    సడన్ గా కేసీఆర్ కు‘పీవీ’ఎందుకు గుర్తొచ్చాడు?

    ప్రతిపక్షాలు వ్యవహారంలో వైసీపీ అనుసరిస్తున్న తీరు చేస్తే సీఎం జగన్ కు ఇప్పటికీ సీబీఐ, ఇడి ల ఫీవర్ ఉన్నట్లుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్ పీఎం మోడీని కలిసినప్పుడు… జగన్ మోడీ కాళ్లకు మొకరిల్లారని టీడీపీ విమర్శలు గుప్పించింది. వైసీపీ అధినేత జగన్ ప్రధానితో ఒప్పందాలు కుదుర్చుకున్నారని విమర్శించింది. కేసుల నుంచి బయట పడేసేందుకు బీజేపీతో ఒప్పందాలు ఉండటంతోనే వైసీపీ బీజేపీ కేంద్ర నాయకత్వంపై దూకుడు ప్రదర్శించడం లేదని వాదనలు ఉన్నాయి.