https://oktelugu.com/

హద్దు దాటిన కరోనా..మొద్దు నిద్రలో కేసీఆర్!

ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యే (ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్‌)లకు, ఒక కాంగ్రెస్‌ సీనియర్ నేత (వి.హనమంతరావు) కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి మహమూద్ అలీకి కరోనా టెస్టులు జరపగా… పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. దింతో ప్రజా ప్రతినిధులను ఈ వైరస్ వెంటాడుతోంది. ఇటీవల మంత్రికి చెందిన కొందరు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకినట్లు తేలడంతో… […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2020 12:24 pm
    Follow us on

    Mohammed Mahmood Ali

    ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యే (ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్‌)లకు, ఒక కాంగ్రెస్‌ సీనియర్ నేత (వి.హనమంతరావు) కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి మహమూద్ అలీకి కరోనా టెస్టులు జరపగా… పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. దింతో ప్రజా ప్రతినిధులను ఈ వైరస్ వెంటాడుతోంది.

    ఇటీవల మంత్రికి చెందిన కొందరు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకినట్లు తేలడంతో… మూడు రోజుల కిందట… ఆయనకు టెస్టు చేశారు. తాజాగా టెస్టు రిపోర్టు వచ్చింది. ఐతే… మహమూద్ అలీకి… ఆస్తమా కూడా ఉంది. అందువల్ల కరోనా లక్షణాలు పెద్దగా లేకపోయినా… ముందుగానే ఆయన్ని ఆస్పత్రిలో చేర్చారు. తన గన్‌ మెన్‌ కి కరోనా పాజిటివ్ అని తేలినా… హోంమంత్రి క్వారంటైన్ అవ్వలేదు. ఇటీవల హరితహారం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రితోపాటూ… సిటీ పోలీస్ కమిషనర్ కూడా పాల్గొన్నారు. దింతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌ కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి ఇల్లు ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికి మంత్రికి అత్యంత తక్కువగానే లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇదిలా ఉంటే.. మరోవైపు సీఎం కేసీఆర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కట్టడికి తగిన ఏర్పాట్లు చేయకపోగా పూర్తిగా లాక్ డౌన్ రూల్స్ ఎత్తివేయడం జరిగింది. టెస్టుల విషయంలో, కేసుల విషయంలో, మృతుల విషయంలో పారదర్శకత లోపించిందని అనేకమంది విమర్శలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకే కరోనా సోకినట్లయితే వారి పక్కన ఉన్న వారిస్థితి ఏమిటని? ఇంకెంతో మందికి కరోనా సోకే అవకాశాలు ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా సీఎం కేసీఆర్ నిద్రమత్తు విడిచిపెట్టి మహమ్మారి కట్టడికి కృషి చేయాలని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు.