Indian Army SSC Tech Recruitment 2026: భారత సైన్యంలో ఆఫీసర్‌గా దేశసేవ చేయాలనుకునే ఇంజినీరింగ్ పట్టభద్రులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC-Tech) 68వ కోర్సు (ఏప్రిల్ 2027 బ్యాచ్) కోసం 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సు ద్వారా ఎంపికైన వారికి శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాలో నియామకం లభిస్తుంది. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..
అర్హతలు
సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌తో పాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా నోటిఫికేషన్‌లో పేర్కొన్న షరతులకు లోబడి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
వయోపరిమితి
అభ్యర్థులు 2027 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తించే అభ్యర్థులకు ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు అమలులో ఉంటాయి.
ఎంపిక విధానం
ఈ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, అనంతరం ఎస్‌ఎస్‌బీ (SSB) ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని దశల్లో అర్హత సాధించిన వారికి తుది మెరిట్ ఆధారంగా నియామకాలు చేపడతారు.
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసిన తర్వాత భారత సైన్యంలో లెఫ్టినెంట్‌గా నియమితులవుతారు. జీతం, మిలిటరీ అలవెన్సులు మరియు ఇతర సౌకర్యాలు కలిపి నెలకు సుమారు ₹1.50 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు ఎలా?
ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 7, 2026లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, విద్యార్హతలు మరియు ఇతర వివరాలను https://www.joinindianarmy.nic.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేయొచ్చు.
