భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు కరోనా రక్షక్, కరోనా కవచ్ పాలసీలను ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) రూపొందించింది. జూలై 10 నుంచి ఈ పాలసీలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని జనరల్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు రీ-ఇంబర్స్ మెంట్ బేస్డ్ స్టాండర్డ్ కోవిడ్ 19 పాలసీ అందించడం తప్పనిసరి.
ఐఆర్‌డీఏఐ రూపొందించిన కోవిడ్ 19 పాలసీల్లో ‘కరోనా కవచ్’ ఒకటి. ఈ పాలసీ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇక ఈ పాలసీతోపాటు కరోనా రక్షక్ పేరుతో మరో పాలసీ ఉంది. ఇది సింగిల్ ప్రీమియం ప్లాన్. ఈ పాలసీ వివరాలు ఇలా ఉన్నాయి.
అర్హతలు…
కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 65 ఏళ్ల వరకు వయస్సు ఉన్నవారు ఈ రెండు పాలసీలు తీసుకోవచ్చు. 3 నెలల నుంచి 25 ఏళ్ల లోపు డిపెండెంట్ చిల్డ్రన్ కూడా ఇందులో కవర్ అవుతారు. మొదటి పాలసీలో మాత్రమే ఫ్యామిలీ ఫ్లోటర్ ఆప్షన్ ఉంటుంది. రెండు పాలసీల్లో 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే వెయిటింగ్ పీరియడ్ లో క్లెయిమ్ చేసుకోవడం కుదరదు. ఈ రెండు పాలసీలు దేశమంతా అందుబాటులో ఉంటాయి.