Venu Swamy: అప్పట్లో వేణు స్వామి గురించి జరిగిన చర్చ మీడియాను ఒక ఊపు ఊపేసింది కదా. దెబ్బకు వేణు స్వామి తాను ఇంటర్వ్యూలు ఇవ్వనని.. పూజలు చేయనని చెప్పేసాడు కదా. కానీ ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టాడు. యూట్యూబ్ చానల్లకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. మళ్లీ తన పూజలు మొదలుపెట్టాడు. అప్పట్లో అస్సాంలో పేరుపొందిన కామాఖ్య దేవి ఆలయానికి వెళ్తే.. అక్కడి పూజారులు అతడిని అడ్డుకున్నారు. అప్పట్లో వేణు స్వామి వార్తల్లో తెగ కనిపించాడు. వాస్తవానికి తెలుగు ప్రాంతం నుంచి ఎవరైనా కామాఖ్య దేవి ఆలయానికి వెళ్తే అక్కడి పూజారులు ఘన స్వాగతం పలుకుతారు. కానీ అతడి గురించి తెలుసు కాబట్టి అక్కడి పూజారులు బయటికి గెంటేశారు.
ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ మళ్లీ వేణు స్వామి ఫామ్ లోకి రావాలి అనుకుంటున్నాడు. గిరాకీ పెంచుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే రాజమౌళి తీస్తున్న వారణాసి సినిమాను ఎంచుకున్నాడు. ఆ సినిమాలో రాజమౌళి వామాచారం అనే పద్ధతిని చూపిస్తున్నాడని.. ఇప్పటికే మిరాయ్ సినిమాలో చూపించారని వేణు స్వామి చెప్పడం మొదలుపెట్టాడు. వామాచారం అనేది హిందూ ధర్మానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పద్ధతి. దీనిని షాక్తేయ, తంత్ర సాధన అని పిలుస్తుంటారు. ఇది ఒక రకమైన నిగూడమైన పూజ మార్గం. దీనిని వామ మార్గం లేదా ఎడమ చేతి విధానం అని పిలుస్తుంటారు. లౌకిక నిబంధనలకు భిన్నంగా.. విలక్షణమైన విధానాల ద్వారా దైవాన్ని లేదా మంత్ర శక్తిని వేగంగా సొంతం చేసుకోవడం ఈ విధానం ముఖ్య ఉద్దేశం.
ఇప్పుడు దీని గురించి వేణు స్వామి ప్రస్తావిస్తున్నారు. ఈ దీక్ష చేస్తున్నప్పుడు అమ్మవారు పొట్టలో ఉంటారట. అప్పుడు ఆమెకు మాంసం.. మద్యం.. పెడతారట. అదే విషయాన్ని వేణు స్వామి చెప్పారు.. ఇవే కాకుండా మత్స్యం.. మిధునం.. ముద్ర వంటి వాటిని కూడా ఉపయోగిస్తామని ఆయన చెప్పుకోచ్చారు. ఇప్పటికిప్పుడు వీణస్వామి ఇంతటి క్లిష్టమైన విధానం గురించి చెప్పడం వెనక ఓ బలమైన కారణం ఉంది. వేణు స్వామి పూజలకు అంత సీన్ లేదని అప్పట్లో ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఆయన చేష్టలు కూడా ఉన్నాయి. దీంతో తనను తాను గొప్పగా చెప్పుకోడానికి వేణు స్వామి ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్లే రాజమౌళి వారణాసి సినిమాను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇంతవరకు ఈ సినిమా కథ ఏంటో తెలియకపోయినప్పటికీ.. వామాచారం అనే ఒక క్లిష్టమైన పదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎలాగూ రాజమౌళి ఈ విషయం మీద మాట్లాడలేరు. ఎందుకంటే ఆయనకంత ఖాళీ లేదు. పైగా సినిమా కథను ఇప్పుడే ఆయన రివిల్ చేయలేరు. వేణు స్వామికి ఇప్పుడు పనిలేదు. గిరాకీ అంతకంటే లేదు. కాబట్టి ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి.. నాలుగు రాళ్లు వెనకేసుకొనే పనిలో పడ్డారు. ఇక యూట్యూబ్ ఛానల్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్లకు కూడా ఎంతో కొంత కావాలి కదా.. అందువల్లే జనాల మీదికి ఈ పిచ్చి ఇంటర్వ్యూలు వదులుతున్నారు.
